పీత పెంకుల టీ షర్ట్‌!

పీత పెంకులతో టీ షర్ట్‌. అదీ చెమట కంపు కొట్టనిది! చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అలాంటి విచిత్రాన్నే సృష్టించారు ఆల్‌బర్డ్స్‌ కంపెనీ రూపకర్తలు.

Updated : 19 May 2021 07:25 IST

పీత పెంకులతో టీ షర్ట్‌. అదీ చెమట కంపు కొట్టనిది! చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అలాంటి విచిత్రాన్నే సృష్టించారు ఆల్‌బర్డ్స్‌ కంపెనీ రూపకర్తలు. పీతల పెంకుల్లో చిటోసాన్‌ అనే పదార్థముంటుంది. దీంతో ట్రైనో అనే నూలును తయారుచేసి.. ఈ కొత్తరకం టీ షర్ట్‌ను రూపొందించారు. ఇది చాలాసేపు తాజాగా ఉంటుంది. నూలు ఉపరితలం గట్టిగా ఉండటం వల్ల చెమట కంపును కలిగించే బ్యాక్టీరియా దీని మీద వృద్ధి చెందదు. ఫలితంగా దీన్ని ఎక్కువసార్లు ఉతకాల్సిన అవసరముండదన్నమాట. పాలిస్టర్‌ టీ షర్ట్‌తో పోలిస్తే దీంతో వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌ 20% తక్కువని భావిస్తున్నారు. అటు పర్యావరణ హితం, ఇటు సౌకర్యం అంటే ఇదేనేమో.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని