పీసీలో స్క్రీన్‌ రికార్డింగ్‌

స్క్రీన్‌ రికార్డర్‌తో బోలెడన్ని లాభాలు! వీడియో కాల్స్‌ రికార్డింగ్‌ చేయొచ్చు. జూమ్‌ మీటింగ్‌లు ఒడిసి పట్టొచ్చు. ఇప్పుడైతే ఈ ఫీచర్‌ స్మార్ట్‌ఫోన్స్‌కే పరిమితం.

Updated : 19 May 2021 07:25 IST

స్క్రీన్‌ రికార్డర్‌తో బోలెడన్ని లాభాలు! వీడియో కాల్స్‌ రికార్డింగ్‌ చేయొచ్చు. జూమ్‌ మీటింగ్‌లు ఒడిసి పట్టొచ్చు. ఇప్పుడైతే ఈ ఫీచర్‌ స్మార్ట్‌ఫోన్స్‌కే పరిమితం. మరి పర్సనల్‌ కంప్యూటర్‌ మాటేంటి? ఇబ్బందేం లేదు.. కొన్ని సాఫ్ట్‌వేర్‌లు వేసుకుంటే పీసీలోనూ రికార్డింగ్‌ అవకాశం అందిపుచ్చుకోవచ్చు. ఇవిగోండి ఆ దారులు.

ఐస్‌క్రీం స్క్రీన్‌ రికార్డర్‌

ఇది పీసీలో ఉందంటే మొత్తం కంప్యూటర్‌ స్క్రీన్‌ని రికార్డు చేసుకోవచ్చు. అంతా అవసరం లేదనుకుంటే కావాల్సిన పార్ట్‌నే ఎంచుకోవచ్చు. దీంతో వెబినార్లు, వీడియో కాల్స్‌, కాన్ఫరెన్స్‌లు, వెబ్‌కామ్‌, స్క్రీన్‌షాట్‌, క్లిప్‌బోర్డు, జేపీజీ, పీఎన్‌జీ, గేమ్‌లు కూడా తేలికగా రికార్డు చేసుకోవచ్చు. ఎంపీ4, ఎంకేవీ, వెబ్‌ఎం ఫార్మెట్లు సహకరిస్తుంది. ఫ్రీ యూజర్లు పది నిమిషాల నిడివి మాత్రమే వాడుకునే అవకాశం ఉండటం పెద్ద లోపం.

ఎజ్విడ్‌ వీడియో మేకర్‌

మరో మంచి డెస్క్‌టాప్‌ స్క్రీన్‌ రికార్డింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇది. కొన్ని క్లిక్స్‌తో హై-రిజల్యుషన్‌ వీడియో చిత్రాలుగా మలచుకోవచ్చు. దీంట్లో కూడా కావాల్సిన చోట మాత్రమే డ్రాగ్‌ చేసి రికార్డు చేసే అవకాశం ఉంది. అదనంగా పేరు, కీవర్డ్‌లు సైతం ఇచ్చుకోవచ్చు. ఆటోసేవ్‌, స్లైడ్‌ షోలు, ఆడియో రికార్డింగ్‌, వెబ్‌క్యామ్‌ రికార్డింగ్‌, నేరుగా యూట్యూబ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయమూ ఉంది. రికార్డు నిడివి 45 నిమిషాలకే పరిమితం.

అటోమీ యాక్టివ్‌ ప్రెజెంటర్‌

అత్యుత్తమ వీడియో నాణ్యతతో స్క్రీన్‌ రికార్డుని అందించే మరో సాఫ్ట్‌వేర్‌ అటోమీ యాక్టివ్‌ ప్రెజెంటర్‌. ఉచిత వెర్షన్‌లో సైతం అపరిమిత రికార్డింగ్‌ సదుపాయం ఉంది. ఇతర సాఫ్ట్‌వేర్‌ల్లాగా వాటర్‌మార్క్‌లు ఏం ఉండవు. ఎంపీ4, ఎఫ్‌ఎల్‌వీ, ఏవీఐ, డబ్ల్యూఎంవీ, వెబ్‌ఎం తదితర ఫార్మెట్లన్నీ సపోర్ట్‌ చేస్తుంది. రికార్డింగ్‌ తర్వాత ఎడిట్‌ చేసే సదుపాయం కూడా ఉంది.

బ్యాండికామ్‌ స్క్రీన్‌ రికార్డర్‌

దీంతో స్క్రీన్‌ రికార్డ్‌ చేయడం చాలా తేలిక. మొత్తం తెర లేదా కావాల్సిన చోట.. ఎక్కడైనా రికార్డు చేసుకోవచ్చు. వీడియోల స్ట్రీమింగ్‌, గేమ్‌లు, ఫొటోలు.. ఏదైనా అందిపుచ్చుకోవచ్చు. ఏవీఐ, ఎంపీ4 సపోర్ట్‌ చేస్తుంది. రికార్డింగ్‌ సమయంలోనే ఎడిటింగ్‌, వాటర్‌మార్క్‌లు వేసుకోవచ్చు. ఉచిత వెర్షన్‌లో ఈ సదుపాయం లేదు.

స్క్రీన్‌ప్రెస్సో

డెస్క్‌టాప్‌ వీడియోలను హెచ్‌డీ సామర్థ్యంతో రికార్డు చేయొచ్చు. మిగతా వాటితో పోలిస్తే ఈ సాఫ్ట్‌వేర్‌ అత్యధిక ఫీచర్లు అందిస్తోంది. ఎంపీ4, డబ్ల్యూఎంవీ, వెబ్‌ఎం, ఓజీజీ ఫార్మెట్లలో వీడియోలను సేవ్‌ చేసుకోవచ్చు. లేబెలింగ్‌, ఎడిటింగ్‌ ఆప్షన్లున్నాయి. సేవ్‌ చేసిన వీడియోలను ఈమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, డ్రాప్‌బాక్స్‌లకు నేరుగా పంపుకోవచ్చు. ఉచిత వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ని సపోర్ట్‌ చేయకపోవడం లోటు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని