Oximeter: నకిలీ ఆక్సీమీటర్‌ యాప్స్‌తో జాగ్రత్త!

మొబైల్‌ ఫోన్‌ కెమెరా మీద వేలు పెడితే చాలు... రక్తంలోని ఆక్సిజన్‌ మోతాదులు తెలుసుకోవచ్చు. కొన్ని యాప్‌లు ఇలాంటి ప్రచారంతోనే బురిడీ కొట్టిస్తున్నాయి. వీటి వలలో పడొద్దు. చాలావరకివి గూఢచర్య

Updated : 02 Jun 2021 07:48 IST

మొబైల్‌ ఫోన్‌ కెమెరా మీద వేలు పెడితే చాలు... రక్తంలోని ఆక్సిజన్‌ మోతాదులు తెలుసుకోవచ్చు. కొన్ని యాప్‌లు ఇలాంటి ప్రచారంతోనే బురిడీ కొట్టిస్తున్నాయి. వీటి వలలో పడొద్దు. చాలావరకివి గూఢచర్య యాప్‌లు. ఐఫోన్‌ వంటి అధునాతన ఫోన్లలో అధీకృత పల్స్‌ ఆక్సీమీటర్‌ యాప్‌ ఉన్నా కూడా అది వైద్య అవసరాల కోసం కాదు. ఆటలాడేవారు, పర్వతాలు ఎక్కటం వంటివి చేసేవారు ఒక అంచనాకు రావటానికే. సాధారణంగా పల్స్‌ ఆక్సీమీటర్‌ పరికరం వేలు వంటి శరీర భాగాల నుంచి వెలువడే కాంతిని రెండు వేర్వేరు తరంగ దైర్ఘ్యాలుగా (రెడ్‌, ఇన్‌ఫ్రారెడ్‌) పరిగణనలోకి తీసుకుంటుంది. వీటి ఆధారంగా గుండె వేగం, ఆక్సిజన్‌ వంటి వాటిని లెక్కిస్తుంది. మామూలు స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌ఫ్రారెడ్‌ పరిజ్ఞానం ఉండదు. ఈ నకిలీ ఆక్సీమీటర్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు జీపీఎస్‌, మెమరీ కార్డు, బ్లూటూత్‌లను వాడుకోవటానికి అనుమతి అడుగుతాయి. గ్యాలరీ, కాంటాక్టులు, సేవ్‌ అయిన డాక్యుమెంట్లను వాడుకోవటానికి ప్రయత్నిస్తాయి. బ్యాంకు వివరాలను దొంగిలించొచ్చు. ఓటీపీ నంబర్లను చదవొచ్చు. అన్నింటికన్నా భయంకరమైన విషయం- వేలి ముద్రల వంటి బయోమెట్రిక్‌ సమాచారాన్ని తస్కరించే అవకాశముంది. జాగ్రత్త.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని