క్రోమ్‌ యాప్‌తోనే స్క్రీన్‌షాట్‌!

పీసీ కావచ్చు, ఫోన్లు కావొచ్చు. ఎక్కువమంది వాడేది గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజరే. ఎప్పటికప్పుడు కొత్త టూల్స్‌తో నిత్య నూతనంగా విలసిల్లుతోంది. తాజాగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బిల్టిన్‌గా స్క్రీన్‌షాట్‌ టూల్‌తోనూ

Updated : 02 Jun 2021 04:40 IST

పీసీ కావచ్చు, ఫోన్లు కావొచ్చు. ఎక్కువమంది వాడేది గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజరే. ఎప్పటికప్పుడు కొత్త టూల్స్‌తో నిత్య నూతనంగా విలసిల్లుతోంది. తాజాగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బిల్టిన్‌గా స్క్రీన్‌షాట్‌ టూల్‌తోనూ దర్శనమివ్వనుంది. గూగుల్‌ క్రోమ్‌ 91 వెర్షన్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. ఏదైనా తొందరలో ఉన్నప్పుడు వెబ్‌ అంశాలను మాత్రమే ఇతరులకు పంపాలని అనుకునే వారికిది ఎంతగానో ఉపయోగపడనుంది. అడ్రస్‌ బార్‌తో పాటు వెబ్‌పేజీని ఈ టూల్‌ ఒడిసిపడుతుంది. వెబ్‌ పేజీలను స్క్రీన్‌షాట్‌ తీసుకోవటమే కాదు.. క్రాప్‌, ఎడిట్‌ చేసుకునే సదుపాయమూ ఉంటుంది. బ్రౌజర్‌ నుంచి బయటకు రాకుండానే మార్పులు చేసుకోవచ్చు. స్క్రీన్‌షాట్‌ తీసుకున్నాక క్రాప్‌, టెక్స్ట్‌, డ్రా ఆప్షన్లు కనిపిస్తాయి. పేజీలో అవసరమైన భాగాలను క్రాప్‌ చేసుకున్నాక హైలైట్‌ చేయాలని అనుకునే అంశాల మీద గీతలు, బొమ్మలు గీసుకోవచ్చు. తాము చేసిన మార్పులు వద్దనుకుంటే అన్‌డూ చేసుకోవచ్చు. అనవసరమనుకుంటే డిలిట్‌ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను జోడించుకోవాలని అనుకుంటే అడ్రస్‌ బార్‌ నుంచి hrome://flags/#chrome-share-screenshot flag ను ఎనేబుల్‌ చేసుకొని, బ్రౌజర్‌ను రీస్టార్ట్‌ చేయాలి. కాకపోతే గూగుల్‌ క్రోమ్‌ 91 ఉపయోగిస్తున్నారో లేదో చూసుకోవాలి. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని