వాట్సప్‌లో ‘ఫాస్ట్‌ ప్లేబ్యాక్‌’

వాయిస్‌ మెసేజ్‌ల కోసం వాట్సప్‌ కొత్తగా ‘ఫాస్ట్‌ ప్లేబ్యాక్‌’ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. టైప్‌ చెయ్యటం కష్టంగా భావించే

Updated : 09 Jun 2021 12:19 IST

వాయిస్‌ మెసేజ్‌ల కోసం వాట్సప్‌ కొత్తగా ‘ఫాస్ట్‌ ప్లేబ్యాక్‌’ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. టైప్‌ చెయ్యటం కష్టంగా భావించే వారు సందేశాలు పంపించటానికి వాయిస్‌ మెసేజ్‌ని ఆశ్రయిస్తుంటారు. అయితే, ఒకోసారి సుదీర్ఘ వాయిస్‌ మెసేజ్‌లు వినే సమయం లేకపోవచ్చు. అలాంటప్పుడు ‘ఫాస్ట్‌ ప్లేబ్యాక్‌’ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా డిఫాల్ట్‌గా ఉండే 1ఎక్స్‌ దగ్గర్నుంచి 1.5ఎక్స్‌, 2ఎక్స్‌ స్పీడ్‌ వరకు పంపిన వ్యక్తి వాయిస్‌ పిచ్‌ మారకుండా వాయిస్‌ మెసేజ్‌ని వినొచ్చు. వాయిస్‌ మెసేజ్‌ వచ్చినప్పుడు, ప్లేబ్యాక్‌ స్పీడ్‌ డిఫాల్ట్‌గా 1ఎక్స్‌తో కనిపిస్తుంది. స్పీడ్‌ మీద టచ్‌ చేసి పెంచుకుని, ప్లే నొక్కాలి. ఈ ఫీచర్‌ కోసం వాట్సప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ వాడుతున్నారో లేదో చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని