ప్రతిధ్వనులతో ‘చూడొచ్చు’

గబ్బిలాల మాదిరిగా అతి స్వల్ప ప్రతిధ్వనులను పసిగట్టే శక్తి (సోనార్‌) చూపులేనివారికీ అబ్బితే? ఎక్కడికంటే అక్కడికి తేలిగ్గా వెళ్లిపోవచ్చు కదా. సాధన చేస్తే ఇదేమీ అసాధ్యం కాదని డర్హమ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నోటితో ‘క్లిక్‌’మని చప్పుడు చేసి, అవి ఎదుటి వస్తువులకు తాకి తిరిగి వస్తున్న శబ్దాలను

Updated : 16 Jun 2021 08:14 IST

గబ్బిలాల మాదిరిగా అతి స్వల్ప ప్రతిధ్వనులను పసిగట్టే శక్తి (సోనార్‌) చూపులేనివారికీ అబ్బితే? ఎక్కడికంటే అక్కడికి తేలిగ్గా వెళ్లిపోవచ్చు కదా. సాధన చేస్తే ఇదేమీ అసాధ్యం కాదని డర్హమ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నోటితో ‘క్లిక్‌’మని చప్పుడు చేసి, అవి ఎదుటి వస్తువులకు తాకి తిరిగి వస్తున్న శబ్దాలను (ఎకోలొకేషన్‌) ఎవరైనా తేలికగానే గుర్తించొచ్చని వివరిస్తున్నారు. నిజానికి కొందరు చూపులేనివారు ఇలాంటి విద్యతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగటం అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. అయితే అంధులు ఎవరైనా దీన్ని తేలికగా నేర్చుకునే అవకాశముందని పరిశోధకులు నిరూపించారు. నోటితో లొట్టలు వేస్తూ, ఎకోలొకేషన్‌ను గుర్తించేలా 12 మంది అంధులకు,  14 మంది చూపు తగ్గినవారికి 10 వారాల పాటు శిక్షణ ఇవ్వగా అందరూ ఆయా ప్రాంతాల్లో తేలికగా తిరుగాడినట్టు గుర్తించారు. కొందరైతే పదేళ్ల పాటు శిక్షణ తీసుకున్న నిపుణుల మాదిరిగానూ ప్రవర్తించారు. ఏ వయసువారైనా, అంధత్వం ఎంత తీవ్రంగా ఉన్నా ఈ విద్య అబ్బుతుండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని