యుద్ధనౌకనే లేపే అయస్కాంతం

శిలాజ ఇంధనాలు, పునరుత్పాదనకు వీలుకాని ఇతరత్రా ఇంధనాల స్థానాన్ని శుద్ధ ఇంధనంతో భర్తీ చేయటంపై ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు సాగు తున్నాయి. ఈ దిశగా ఫ్రాన్స్‌లో మరో ముందడుగు పడింది.

Published : 23 Jun 2021 01:37 IST

శిలాజ ఇంధనాలు, పునరుత్పాదనకు వీలుకాని ఇతరత్రా ఇంధనాల స్థానాన్ని శుద్ధ ఇంధనంతో భర్తీ చేయటంపై ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు సాగు తున్నాయి. ఈ దిశగా ఫ్రాన్స్‌లో మరో ముందడుగు పడింది. సూర్యుడిలో శక్తి ఉత్పాదన ప్రక్రియను అనుకరించే ఫ్యూజన్‌ రియాక్టర్‌లో బిగించటానికి అత్యంత శక్తిమంతమైన అయస్కాంతం సిద్ధమైంది. సెంట్రల్‌ సాలినాయిడ్‌గా పిలిచే ఇది యుద్ధనౌకను 6 అడుగుల ఎత్తువరకు గాలిలోకి లేపగలదు! ఫ్రాన్స్‌ ఇంధన ప్రాజెక్టులో ప్రధాన పాత్ర పోషించే దీన్ని అమెరికాకు చెందిన జనరల్‌ అటోమిక్స్‌ సంస్థ రూపొందించింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని ఐటీఈఆర్‌ (ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్టర్‌) కేంద్రానికి తరలిస్తోంది. రియాక్టర్‌కు ఈ అయస్కాంతమే గుండె కాయ. ఐటీఈఆర్‌ ప్లాస్మాలో శక్తిమంతమైన విద్యుత్‌ని పుట్టించేది ఇదే. ఫ్యూజన్‌ ప్రతిచర్యను నియంత్రించటంలో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైడ్రోజన్‌ ప్లాస్మాని 15 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి చేస్తారు. ఇది సూర్యుడి కేంద్రకంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ వేడి కలిగి ఉంటుంది. విడి భాగాలన్నింటినీ కలిపిన తర్వాత ఈ అయస్కాంతం 59 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో వేయి టన్నుల బరువు తూగుతుంది. దీని అయస్కాత బలం భూ అయస్కాంత క్షేత్రం కన్నా సుమారు 2,80,000 రెట్లు ఎక్కువ కావటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు