భయం వాసననూ పట్టేస్తాయి..

కుక్కల ఘ్రాణశక్తి అద్భుతమైంది. నేరగాళ్లు, బాంబుల ఆచూకీని పట్టించటంలో వీటి గొప్పతనాన్ని చూస్తున్నదే. అంతేనా? ఇవి జబ్బులనూ గుర్తించగలవు. ‘భయం వాసన’ను పసిగట్టటం ద్వారా తమ యజమానులకు ఎప్పుడు మూర్ఛ వస్తుందనే విషయాన్ని

Updated : 30 Jun 2021 06:36 IST

కుక్కల ఘ్రాణశక్తి అద్భుతమైంది. నేరగాళ్లు, బాంబుల ఆచూకీని పట్టించటంలో వీటి గొప్పతనాన్ని చూస్తున్నదే. అంతేనా? ఇవి జబ్బులనూ గుర్తించగలవు. ‘భయం వాసన’ను పసిగట్టటం ద్వారా తమ యజమానులకు ఎప్పుడు మూర్ఛ వస్తుందనే విషయాన్ని కుక్కలు అంచనా వేయగలవని తాజాగా బయటపడింది. భయం వాసన ఏంటని అనుకుంటున్నారా? చెమటలోని హార్మోన్ల వాసన. మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఆయా హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఇవి చెమట ద్వారా బయటకు వస్తుంటాయి. వీటిని కుక్కలు సమర్థంగా గుర్తిస్తున్నట్టు కొలరాడోలోని డెన్వర్‌ హెల్త్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన ఎడ్వర్డ్‌ మా గుర్తించారు. మూర్ఛతో బాధపడేవారికి సాయం చేయటానికి ఆయన కుక్కలకు శిక్షణ ఇస్తుంటారు. ఇవి మూర్ఛ వచ్చినప్పుడు ఫోన్‌ బటన్‌ను నొక్కటమే కాదు, గంట ముందుగానే మూర్ఛ వచ్చే విషయాన్ని గుర్తిస్తుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని