లేజర్‌ ‘చిత్రం’

అదో లోహపు కాన్వాసు. దానిపై ప్రముఖ చిత్రకారుడు గీసిన చిత్రం నకలు. అదీ లేజర్‌తో. చిత్రమే కదా! రష్యాలోని ఐటీఎంఓ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి ‘చిత్రాన్నే’ సృష్టించారు. అప్పుడెప్పుడో 139 సంవత్సరాల క్రితం విన్సెంట్‌ వ్యాన్‌ ఘోష్‌ అనే....

Updated : 30 Jun 2021 06:24 IST

దో లోహపు కాన్వాసు. దానిపై ప్రముఖ చిత్రకారుడు గీసిన చిత్రం నకలు. అదీ లేజర్‌తో. చిత్రమే కదా! రష్యాలోని ఐటీఎంఓ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి ‘చిత్రాన్నే’ సృష్టించారు. అప్పుడెప్పుడో 139 సంవత్సరాల క్రితం విన్సెంట్‌ వ్యాన్‌ ఘోష్‌ అనే చిత్రకారుడు వేసిన ‘ద స్టారీ నైట్‌’ అనే చిత్రం నకలును లేజర్‌ సాయంతో లోహపు కాన్వాసు మీద గీయటంలో విజయం సాధించారు.

ఎలా చేశారు?

ముందుగా లోహాన్ని ఆక్సీకరణ దశకు చేరుకునేంతవరకు లేజర్‌తో వేడి చేశారు. దీంతో లోహం ఉపరితలం మీద పలుచటి ఆక్సైడ్‌ పొర ఏర్పడింది. ఈ పొర పైనుంచి, అలాగే లోహం ఉపరితలం మీది నుంచి ప్రతిఫలించే రెండు తరంగాల సంయోగంతో వైవిధ్యమైన రంగుల కలయికలను సృష్టించారు. ఆక్సీకరణ జరిగే సమయంలో తేడాలను బట్టి ఆక్సైడ్‌ పొర మందం తీరుతెన్నులను నియంత్రించటం ద్వారా వివిధ తరంగధైర్ఘ్యాలను పుట్టించటంతో ఇది సాధ్యమైంది.

ఎందుకు చేశారు?

ప్రస్తుతం ఈ పరిజ్ఞానాన్ని చేత్తో పట్టుకోవటానికి అనువైన పరికరానికి బదలాయించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆధునిక కళాకారులు వినూత్నమైన కళలను సృష్టించటానికిది ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని