కొత్త విండోస్ తెరుస్తారా?
ఎంతో ఉత్కంఠ రేపిన విండోస్ 11 ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. కొత్త డిజైన్, వినూత్నమైన ఫీచర్లు, మెరుగైన నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకేసారి ఎన్నో పనులు చేసుకునేలా ఎక్కువ డెస్క్‌టాప్‌లను సృష్టించుకోవటానికి, వీటి మధ్య తేలికగా మారటానికి వీలుండటంతో పాటు సరికొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్, ఆండ్రాయిడ్ యాప్‌లను సపోర్టు చేయటం వంటి మార్పులెన్నింటినో కలబోసుకొని వచ్చింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యంత అధునాతమైన, సమగ్రమైన ఆపరేటింగ్...
ఎంతో ఉత్కంఠ రేపిన విండోస్ 11 ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. కొత్త డిజైన్, వినూత్నమైన ఫీచర్లు, మెరుగైన నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకేసారి ఎన్నో పనులు చేసుకునేలా ఎక్కువ డెస్క్‌టాప్‌లను సృష్టించుకోవటానికి, వీటి మధ్య తేలికగా మారటానికి వీలుండటంతో పాటు సరికొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్, ఆండ్రాయిడ్ యాప్‌లను సపోర్టు చేయటం వంటి మార్పులెన్నింటినో కలబోసుకొని వచ్చింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యంత అధునాతమైన, సమగ్రమైన ఆపరేటింగ్ సిస్టమ్‌గా పరిగణిస్తున్న దీని విశేషాలేంటో చూద్దాం.
మైక్రోసాఫ్ట్ సంస్థ ఐదేళ్ల తర్వాత విండోస్ ప్లాట్ఫామ్లో తొలి భారీ మార్పును ఆవిష్కరించింది. టెక్నాలజీ పరిశ్రమ కోసం కొన్ని గణనీయమైన మార్పులకూ నాంది పలికింది. విండోస్ 10ను విడుదల చేస్తున్న సమయంలోనే ‘ఇది విండోస్ చివరి వర్షన్’ అని కంపెనీ గొప్పగా ప్రకటించింది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ అంటేనే భారీ మార్పులకు సంకేతం. భవిష్యత్ యాప్స్, సాఫ్ట్వేర్ అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నా రనటానికిదో సూచన. కాబట్టే డెవలపర్లు, వినియోగదారుల్లో ఇది సరికొత్త ఆసక్తిని రేకెత్తించింది. అనుకున్నట్టుగానే మునుపెన్నడూ లేని ఫీచర్లను ముందుకు తెచ్చింది.
ఆండ్రాయిడ్ యాప్ సపోర్టు
అతి పెద్ద కొత్త మార్పు ఇదే. ఇప్పుడిక విండోస్‌లోనూ ఆండ్రాయిడ్ యాప్‌లను వాడుకోవచ్చు. ఇందుకోసం అమెజాన్, ఇంటెల్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. విండోస్ పరికరాలకు అమెజాన్ యాప్‌స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను అందిస్తుంది. వివిధ ప్రాసెసర్లతో తయారయ్యే విండోస్ ల్యాప్‌టాప్‌ల్లో యాప్‌లు పనిచేయటానికి అనువైన పరిజ్ఞానాన్ని ఇంటెల్ బ్రిడ్జ్ కల్పిస్తుంది. ఇలా విండోస్‌తో ఆండ్రాయిడ్ యాప్‌ల కలయికతో పీసీలు మరింత వైవిధ్య భరితం కానున్నాయి. అంటే జొమాటో, ఓలా, ఉబర్ వంటి యాప్‌లను సైతం కొత్త విండోస్ వేదికలో వినియోగించుకోవటానికి వీలుంటుందన్నమాట.
టీమ్స్ జోడింపు
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వీడియో సమావేశాలకు ఆదరణ గణనీయంగా పెరిగింది. మున్ముందూ ఈ ధోరణి కొనసాగేదే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్11కు టీమ్స్‌నూ జతచేసింది. అంటే టీమ్స్ ఇకపై నేరుగా కొత్త ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమవుతుందన్నమాట. స్టార్ట్ మెనూలోనే ఇది దర్శనమిస్తుంది. వీడియో సమావేశాలు, మాటామంతీ పరంగా ఇది పెద్ద అడుగే. దీంతో తేలికగా, త్వరగా టీమ్ సమావేశాల్లో పాల్గొనటానికి వీలవుతుంది. టాస్క్‌బార్ నుంచే మ్యూట్, అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. పర్సనల్ కాంటాక్ట్‌లతో ఎక్కడైనా టెక్స్ట్, ఛాట్, వాయిస్, వీడియోల ద్వారా కనెక్ట్ కావొచ్చు. అవతలివాళ్లు టీమ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకపోయినా ఎస్ఎంఎస్ ద్వారా అనుసంధానమయ్యే వీలుండటం విశేషం.
భవిష్యత్ పీసీలకు మార్గనిర్దేశం
డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో తిరుగులేని ఆధిపత్యం గల విండోస్ కొత్త వర్షన్ భవిష్యత్ పీసీలకూ మార్గనిర్దేశం చేయనుంది. ఎందుకంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవటానికి పీసీకి కనీస అవసరాలు తప్పనిసరి. ‘సపోర్టు చేసే పీసీ’ల్లో విండోస్11 ఉచితంగా అప్డేట్ అవుతుంది గానీ పీసీకి కనీసం 64-బిట్ సీపీయూ, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉండాలి. పైగా టీపీఎం సెక్యూరిటీ చిప్‌తో కూడినదై ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని భద్రంగా ఉంచటం కోసం దీన్ని తప్పనిసరి చేశారు. దీంతో విండోస్11 సపోర్టుతో కూడిన చవకైన ల్యాప్‌టాప్‌లు సైతం చాలా వేగంగా, సురక్షితంగా పనిచేస్తాయి.
థర్డ్‌పార్టీ చెల్లింపులకు సై
డెవలపర్లు థర్డ్‌పార్టీ చెల్లింపు వ్యవస్థలను వాడుకోవటానికి కొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్స్ అనుమతిస్తుంది. తమ యాప్‌లు, సేవల నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా డెవలపర్లే ఉంచుకోవచ్చు.
మీ పీసీ సపోర్టు చేస్తుందా?
అన్ని యోగ్యమైన విండోస్ 10 కంప్యూటర్లలోనూ విండోస్ 11ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మీ కంప్యూటర్ దీన్ని సపోర్టు చేస్తుందా? తెలియటం లేదా? దీన్ని గుర్తించటానికీ మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ పీసీ హెల్త్ చెక్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ముందుగా https://www.microsoft.com/en-in/windows/windows-11 లోకి వెళ్లాలి. ఓపెన్ అయిన పేజీలో కిందికి వెళ్లి చెక్ కంపాటబిలిటీని క్లిక్ చేయాలి. విండోస్ పీసీ హెల్త్ చెక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ పూర్తయ్యాక ‘ఓపెన్ విండోస్ పీసీ హెల్త్ చెక్’ ఆప్షన్‌ను ఎంచుకొని ఫినిష్ బటన్‌ను నొక్కాలి. అనంతరం చెక్ నౌ బటన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే చాలు. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లు విండోస్ 11కు అనుగుణమైనదో కాదో చెక్ చేసి తెలుపుతుంది.
ఎన్నో పనులు ఒకేసారి
ఒకేసారి చాలా పనులు చేసుకోవటానికి కొత్త స్నాప్ లేఅవుట్లు, స్నాప్ గ్రూప్స్, డెస్క్‌టాప్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకమైన డెస్క్టాప్లనూ సృష్టించుకోవచ్చు. అవసరమైనట్టుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు- పనులకు, చదువుకోవటానికి, గేమింగ్‌కు వేర్వేరుగా డెస్క్‌టాప్‌లను సృష్టించుకోవచ్చు.
గేమర్లకు పండుగ
పీసీ గేమర్ల కోసం గణనీయమైన మార్పులెన్నో కనువిందు చేయనున్నాయి. డైరెక్ట్ఎక్స్ 12 అల్టిమేట్‌ను విండోస్ 11 సపోర్టు చేస్తుంది. ఇది చాలా ఎక్కువ ఫ్రేమ్ రేట్లతో గ్రాఫిక్స్‌కు వీలు కల్పిస్తుంది. మరింత స్పష్టమైన, విశాలమైన దృశ్యాలకు అనుగుణమైన ఆటో హెచ్డీఆర్నూ సపోర్టు చేస్తుంది. మరింత వేగంగా లోడ్ చేసుకోవటానికి తోడ్పడే డైరెక్ట్స్టోరేజ్ సైతం అందుబాటులోకి రానుంది. దీంతో సీపీయూ ద్వారా కాకుండా నేరుగా గ్రాఫిక్ కార్డుల మీదే గేమ్స్ అసెట్స్‌ను లోడ్ చేసుకోవచ్చు. విండోస్ 11లో బిల్టిన్గాఎక్స్బాక్స్ సైతం అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ గలవారంతా 100కు పైగా హై క్వాలిటీ గేమ్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
వైవిధ్యమైన విడ్జెట్లు
వార్తలు, వాతావరణ, క్యాలెండర్, చేయాల్సిన పనుల జాబితా, ఇటీవల చూసిన ఫొటోలకు సంబంధించిన అప్డేటెడ్ విడ్జెట్లు కనువిందు చేయనున్నాయి. అంటే ఫోన్లలో మాదిరిగానే డెస్క్‌టాప్‌లోనూ వార్తలు, వాతావరణం వంటివి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చన్నమాట. కావాలనుకుంటే అన్నింటిని ఒకేసారి ఫుల్ స్క్రీన్‌లోనూ చూసుకోవచ్చు. ఈ విడ్జెట్లతో కొత్తవి జోడించుకోవచ్చు. వద్దనుకుంటే ఎప్పుడైనా తొలగించుకోవచ్చు. పర్సనలైజ్డ్ ఫీడ్‌ను ఓపెన్ చేసినప్పుడు తెర మీద గ్లాసు పొర మాదిరిగా జరుగుతూ వెళ్తుంది. చేస్తున్న పనికి ఎలాంటి ఆటంకం కలగదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు