పిల్లల కోసం తేలికైన ట్యాబ్లెట్‌

ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే పిల్లల కోసం బడ్జెట్‌లో దొరికే ట్యాబ్‌ కోసం చూస్తున్నారా? అయితే సామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఏ7 లైట్‌ వైపు ఓ కన్నేసి చూడండి. ధర తక్కువైనా క్వాలిటీలో ఎలాంటి తేడా ఉండదు. మంచి వినోద పరికరంగానూ ఉపయోగపడగలదు.

Published : 14 Jul 2021 01:30 IST

కొత్త పరికరం

న్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే పిల్లల కోసం బడ్జెట్‌లో దొరికే ట్యాబ్‌ కోసం చూస్తున్నారా? అయితే సామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఏ7 లైట్‌ వైపు ఓ కన్నేసి చూడండి. ధర తక్కువైనా క్వాలిటీలో ఎలాంటి తేడా ఉండదు. మంచి వినోద పరికరంగానూ ఉపయోగపడగలదు. దీన్ని పిల్లలను దృష్టిలో పెట్టుకొనే రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌ కన్నా కాస్త పెద్దది, మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ట్యాబ్లెట్ల కన్నా చిన్నది. పలుచటి, తేలికైన దీన్ని ఒక చేత్తోనే వాడుకోవచ్చు. 8.7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో నాణ్యమైన దృశ్యాలు, రెండు స్పీకర్లతో స్పష్టమైన శబ్దాలు దీని సొంతం. వెనకాల కాస్త ప్లాస్టిక్‌ పూతతో కూడిన లోహపు కవర్‌తో దృఢంగానూ కనిపిస్తుంది. సోఫాలో పడుకొని వీడియోలు చూస్తున్నా ఇబ్బంది కలగదు. కిండిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని అమెజాన్‌ నుంచి కొనుక్కునే పుస్తకాలన్నీ చదువుకోవచ్చు. విడిగా బుక్‌ కవర్‌ను కొనుక్కొని దీనికి జోడించుకుంటే స్టాండ్‌గానూ ఉపయోగపడుతుంది. లైట్‌ ప్రాసెసర్‌ కావటం వల్ల దీనికి గల 5,100ఎంఏహెచ్‌ బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది. స్టోరేజీ 64 జీబీ. మైక్రోఎస్‌డీతో 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని