పెద్ద మెయిళ్లను వెతకండిలా

జీమెయిల్‌కి ఎన్నో మెయిల్స్‌ వస్తుంటాయి. ఏళ్లకేళ్లుగా అలాగే ఉండిపోతుంటాయి. ఇవి ఎంత స్పేస్‌ తీసుకుంటున్నాయన్నది ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. వీటిల్లో పెద్ద అటాచ్‌మెంట్లతో కూడినవీ ఉండొచ్చు. ఇవి స్టోరేజీని

Published : 14 Jul 2021 01:30 IST

చిన్న చిట్కా

జీమెయిల్‌కి ఎన్నో మెయిల్స్‌ వస్తుంటాయి. ఏళ్లకేళ్లుగా అలాగే ఉండిపోతుంటాయి. ఇవి ఎంత స్పేస్‌ తీసుకుంటున్నాయన్నది ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. వీటిల్లో పెద్ద అటాచ్‌మెంట్లతో కూడినవీ ఉండొచ్చు. ఇవి స్టోరేజీని తినేస్తుండొచ్చు. వేలాది మెయిళ్లలో వీటిని వెతకటమంటే కష్టమే. తేలికగా గుర్తించటానికి ఓ చిట్కా ఉంది. జీమెయిల్‌ను ఓపెన్‌ చేసి సెర్చ్‌ బాక్స్‌లో has:attachment larger:10M అని టైప్‌ చేయాలి. అప్పుడు 10ఎం కన్నా పెద్ద మెయిళ్లు ప్రత్యక్షమవుతాయి. వీటిల్లో అనవసరమైనవాటిని ఎంచుకొని డిలిట్‌ చేస్తే సరి. తర్వాత ట్రాష్‌లోకి వెళ్లి ఖాళీ చేసేయాలి. ఇంకా పెద్ద సైజు మెయిళ్లను వెతకాలనుకుంటే 10కి బదులు పెద్ద సంఖ్యను వేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని