ఇక రక్తనాళ ముద్రలు!

వేలిముద్రలు ప్రత్యేకం. ముఖ కవళికలు ప్రత్యేకం. ఒకరిని పోలినట్టు మరొకరివి ఉండవు. అందుకే వ్యక్తులను గుర్తించటానికి వీటిని వాడుతుంటారు. ఆఫీసుల్లోనూ హాజరు నమోదుకు వేలిముద్రలు, ఫేస్‌ రికగ్నిషన్‌ స్కానర్లను ఉపయోగిస్తుండటం

Updated : 21 Jul 2021 05:40 IST

వేలిముద్రలు ప్రత్యేకం. ముఖ కవళికలు ప్రత్యేకం. ఒకరిని పోలినట్టు మరొకరివి ఉండవు. అందుకే వ్యక్తులను గుర్తించటానికి వీటిని వాడుతుంటారు. ఆఫీసుల్లోనూ హాజరు నమోదుకు వేలిముద్రలు, ఫేస్‌ రికగ్నిషన్‌ స్కానర్లను ఉపయోగిస్తుండటం తెలిసిందే. ఇవేకాదు.. అరచేతి రక్తనాళాలనూ ఇందుకు వినియోగించుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాతో ఓ ప్రత్యేక పద్ధతినీ రూపొందించారు. వేలిముద్రల మాదిరిగానే అరచేతి వెనక వైపున ఉండే రక్తనాళాలూ ప్రత్యేకమైనవే. అందుకే ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాతో చేతి రక్తనాళాల ఫొటోలను తీసి, కృత్రిమ మేధ సాయంతో వీటిని గుర్తించేలా కంప్యూటర్‌కు శిక్షణ ఇచ్చారు. ఇది 99.8% కచ్చితత్వంతో ఆయా వ్యక్తులను గుర్తించటం విశేషం. వేలిముద్రలు, ఫేస్‌ రికగ్నిషన్‌ స్కానర్లకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వేలిముద్రలను మృదువైన వస్తువుల మీద తీసుకొని స్కానర్లను బోల్తా కొట్టించొచ్చు. ఫొటోలను చూపించి ఫేస్‌ రికగ్నిషన్‌ స్కానర్లను బురిడి కొట్టించొచ్చు. కొన్నిరకాల చర్మం రంగులనూ ఇవి అంతగా గుర్తించలేవు. ఈ నేపథ్యంలో రక్తనాళాల స్కానర్లు బాగా ఉపయోగపడగలవని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌తోనూ వీటిని వాడుకునే వీలుండటం గమనార్హం. నిఘా కెమెరాల్లోనూ వాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని