మొట్టమొదటి 3డీ స్టీలు వంతెన

స్టీలుతో వంతెనలు నిర్మించటం తెలిసిందే. మరి 3డీ ముద్రణ పద్ధతిలో నిర్మిస్తే? నిజంగా కొత్త విషయమే. ప్రపంచంలోనే అలాంటి మొట్టమొదటి వినూత్న స్టీలు వంతెన ఇటీవలే నెదర్లాండ్స్‌లో ఆరంభమైంది. దీన్ని ఒక కాలువ

Published : 21 Jul 2021 01:46 IST

స్టీలుతో వంతెనలు నిర్మించటం తెలిసిందే. మరి 3డీ ముద్రణ పద్ధతిలో నిర్మిస్తే? నిజంగా కొత్త విషయమే. ప్రపంచంలోనే అలాంటి మొట్టమొదటి వినూత్న స్టీలు వంతెన ఇటీవలే నెదర్లాండ్స్‌లో ఆరంభమైంది. దీన్ని ఒక కాలువ మీద అమర్చారు. కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో 3డీ ప్రింటింగ్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే 3డీ పద్ధతిలో ఇళ్లను ముద్రించటం చూస్తున్నాం. దీంతో సంక్లిష్టమైన నిర్మాణాలూ సాధ్యమేనని తాజా వంతెన రుజువు చేసింది. దీన్ని ఆసాంతం రోబోటిక్‌ చేతులే నిర్మించాయి. వెల్డింగ్‌ టార్చ్‌ల సాయంతో స్టీలును పొరలు పొరలుగా పరచుకుంటూ పూర్తి చేశాయి. సుమారు 4,500 కిలోల బరువు, 12 మీటర్ల పొడవుతో కూడిన ఈ వంతెనను నిర్మించటానికి నాలుగు రోబోలు ఆరు నెలల పాటు శ్రమించాయి. ముద్రణ పూర్తయ్యాక అడుగున 12 సెన్సర్లనూ జోడించారు. ఎప్పుడెప్పుడు, ఎంతమంది, ఎలా మీద నడుస్తున్నారనేది ఇవి ఎప్పటికప్పుడు పసిగడతాయి. అలాగే వంతెనపై పడే ఒత్తిడిని, కదలికలను, కంపనాలను, ఉష్ణోగ్రతల మార్పులను గ్రహించి నమోదు చేస్తాయి. వంతెన నిర్వహణతో పాటు మున్ముందు అవసరమైన మార్పులు చేయటానికి ఈ సమాచారం తోడ్పడుతుందని భావిస్తున్నారు. భారీ, మరింత సంక్లిష్టమైన నిర్మాణ ప్రాజెక్టుల్లో 3డీ ప్రింటెడ్‌ స్టీల్‌ను ఎలా వాడుకోవచ్చనేది అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని