రెడ్‌మీ నాజూకు ల్యాప్‌టాప్‌లు

పలుచని, తేలికైన ల్యాప్‌టాప్‌ కోసం చూస్తున్నారా? షామీ కొత్తగా విడుదల చేసిన  రెడ్‌మీబుక్‌ ల్యాప్‌టాప్‌లను ప్రయత్నించి చూడొచ్చు. ఇంటెల్‌ 11వ జెనరేషన్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్లతో కూడిన ఇవి రెండు రకాల్లో అందుబాటులోకి వచ్చాయి.

Published : 18 Aug 2021 02:11 IST

లుచని, తేలికైన ల్యాప్‌టాప్‌ కోసం చూస్తున్నారా? షామీ కొత్తగా విడుదల చేసిన  రెడ్‌మీబుక్‌ ల్యాప్‌టాప్‌లను ప్రయత్నించి చూడొచ్చు. ఇంటెల్‌ 11వ జెనరేషన్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్లతో కూడిన ఇవి రెండు రకాల్లో అందుబాటులోకి వచ్చాయి. రెడ్‌మీబుక్‌ ప్రొ 19.9 మి.మీ. మందం, 1.8 కిలోల బరువుంటుంది. 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920శ్రీ1080 పిక్సెల్స్‌ రెజల్యూషన్‌ దీని సొంతం. మెటాలిక్‌ బాడీతో ఆకర్షణీయంగా కనిపించే దీని స్క్రీన్‌-బాడీ రేషియో 81.8 శాతం. ర్యామ్‌ 8జీబీ, 720పి హెచ్‌డీ కెమెరా, రెండు మైక్రోఫోన్లు ఇతర ఫీచర్లు. ఒకసారి ఛార్జ్‌ చేసే 10 గంటల వరకు పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌తో పాటు 65 వాట్ల ఛార్జర్‌ వస్తుంది. దీంతో 35 నిమిషాల్లోనే 50% వరకు ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇక రెడ్‌మీబుక్‌ ఇ-లెర్నింగ్‌ డిజైన్‌ సైతం రెడ్‌మీబుక్‌ ప్రొ మాదిరిగానే ఉంటుంది. ఐ3 ప్రాసెసర్‌ కలిగుంటుంది. ఇవి రెండూ విండోస్‌ 10తోనే నడుస్తాయి. అందుబాటును బట్టి వీటిని ఉచితంగా విండోస్‌ 11కు అప్‌గ్రేడ్‌ చేసుకునే వీలుంది. ముందుగానే ఎంఎస్‌ ఆఫీస్‌ హోం, స్టుడెంట్‌ ఎడిషన్‌ 2019 లోడ్‌ అయ్యి ఉండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని