గ్రహ దర్శిని

ఇప్పుడు మన ప్రాంతంలోని ఆకాశంలో ఏయే గ్రహాలున్నాయి? ఎక్కడున్నాయి? ఏ నక్షత్ర మండలం ఎక్కడుందో చెప్పగలరా? మేమేమైనా ఖగోళ శాస్త్రవేత్తలమా, మాకేం తెలుస్తుందని కొట్టిపారేయకండి.

Updated : 25 Aug 2021 00:37 IST

ప్పుడు మన ప్రాంతంలోని ఆకాశంలో ఏయే గ్రహాలున్నాయి? ఎక్కడున్నాయి? ఏ నక్షత్ర మండలం ఎక్కడుందో చెప్పగలరా? మేమేమైనా ఖగోళ శాస్త్రవేత్తలమా, మాకేం తెలుస్తుందని కొట్టిపారేయకండి. మబ్బులుంటే ఆకాశమే కనిపించదు. కనిపించినా స్పష్టంగా ఉండకపోవచ్చు. పగటిపూట నక్షత్రాలు, గ్రహాలు అసలే కనిపించవు. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. వీటిని తెలుసుకోవటానికో వెబ్‌ మార్గముంది. అదే https://stellariumweb.org. ఇది యాప్‌ రూపంలోనూ అందుబాటులో ఉంటుంది. దీంతో విశ్వంలోని వింతలను కావాల్సినప్పుడల్లా కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ తెర మీదే చూసుకోవచ్చు. ఇది లొకేషన్‌ సాయంతో పనిచేస్తుంది. దీన్ని ఓపెన్‌ చేయగానే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ఆకాశంలో ఏయే గ్రహాలు, ఏయే నక్షత్ర మండలాలు ఉన్నాయో చూపిస్తుంది. రాత్రిపూట ఓపెన్‌ చేస్తే అప్పటి ఆకాశం తీరుతెన్నులు కనిపిస్తాయి. పగటి పూట అయితే నైట్‌టైమ్‌ వ్యూలో అంతరిక్షాన్ని చూడొచ్చు. దీన్ని ఔత్సాహికులే కాదు.. యూనివర్సిటీలు కూడా ఉపయోగించుకుంటాయి. అంత కచ్చితంగా పనిచేస్తుంది మరి. టైమ్‌ కంట్రోల్స్‌ ఫీచర్‌ ద్వారా మర్నాటి గ్రహాల తీరు తెన్నులనూ చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని