కుకీస్‌ను యాక్సెప్ట్‌ చేయొచ్చా?

వెబ్‌సైట్లను తెరవగానే చాలాసార్లు కుకీస్‌ను యాక్సెప్ట్‌ చేయమనే పాప్‌ అప్‌ కనిపిస్తుంటుంది. వీటిని యాక్సెస్‌ చేయాలా? వద్దా? అనే సందేహం వస్తూనే ఉంటుంది. ఇది వైబ్‌సైట్‌ను బట్టి

Updated : 25 Aug 2021 00:32 IST

వెబ్‌సైట్లను తెరవగానే చాలాసార్లు కుకీస్‌ను యాక్సెప్ట్‌ చేయమనే పాప్‌ అప్‌ కనిపిస్తుంటుంది. వీటిని యాక్సెస్‌ చేయాలా? వద్దా? అనే సందేహం వస్తూనే ఉంటుంది. ఇది వైబ్‌సైట్‌ను బట్టి ఉంటుంది. నమ్మకమైన వెబ్‌సైట్‌ అయితే యాక్సెప్ట్‌ చేస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఏదైనా అనుమానం వస్తే తిరస్కరించటమే మంచిది. ఎందుకంటే ప్రమాదకరమైన వెబ్‌సైట్లు కంప్యూటర్‌లో హానికరమైన కుకీస్‌ను ప్రవేశపెట్టొచ్చు. ఇవి మాల్వేర్‌ సమస్యలకు దారితీయొచ్చు. కొన్ని వెబ్‌సైట్లు జాంబీ కుకీస్‌ను సైతం కంప్యూటర్‌లో జొప్పించే ప్రమాదముంది. ఇవి శాశ్వతంగా ఇబ్బంది పెడతాయి. వీటిని డిలీట్‌ చేయటం అసాధ్యం. ఇక కొన్నిరకాల కుకీస్‌ అనుచితమైన సందేశాలను పంపించొచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు