‘చెమట’ బ్యాటరీ

చెమటతో విద్యుత్తు! వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా. అలాంటి చిత్రాన్నే సుసాధ్యం చేశారు సింగపూర్‌లోని ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు. వినూత్నమైన బ్యాటరీని రూపొందించారు. వెండి పొలుసుల ఎలక్ట్రోడ్లను ప్రింట్‌ చేసి తయారు...

Updated : 23 Aug 2022 11:46 IST

చెమటతో విద్యుత్తు! వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా. అలాంటి చిత్రాన్నే సుసాధ్యం చేశారు సింగపూర్‌లోని ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు. వినూత్నమైన బ్యాటరీని రూపొందించారు. వెండి పొలుసుల ఎలక్ట్రోడ్లను ప్రింట్‌ చేసి తయారు చేసిన ఇది చెమట తగిలినప్పుడు విద్యుత్తును తయారుచేసుకుంటుంది. చాలా పలుచగా, పేపర్‌ బ్యాండేజీ మాదిరిగా ఉండే ఇది మృదువుగా ఉంటుంది. చెమటకు పీల్చుకునే వస్త్రంతోనూ కూడిన ఇది సాగుతుంది కూడా. వాచ్‌లు, రిస్ట్‌బ్యాండులు, స్ట్రిప్స్‌ వంటి ధరించే పరికరాలకు అమర్చుకోవటానికీ వీలుంటుంది. ఈ బ్యాటరీని ధరించి 30 నిమిషాలు సైకిల్‌ తొక్కితే 4.2 వాట్ల విద్యుత్తు తయారవుతున్నట్టు పరీక్షల్లో తేలింది. ఉష్ణోగ్రతను గుర్తించే సెన్సర్‌ పరికరం పనిచేయటానికి.. బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు నిరంతరం సమాచారం పంపటానికిది సరిపోతుంది. ఇందులో భార లోహాలు గానీ హానికారక రసాయనాలు గానీ లేకపోవటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు