ఆ సమయానికే మెసేజ్‌

మర్నాడు స్నేహితుడి పుట్టినరోజు. అర్ధరాత్రి 12 గంటలు దాటుతూనే మెసేజ్‌ పంపాలి. అప్పటివరకు మేల్కొని ఉంటామో లేదో. మధ్యలో నిద్ర ముంచుకొస్తే? అందరి కన్నా ముందే శుభాకాంక్షలు తెలపాలనే కోరిక అలాగే ఉండిపోతుంది. మరెలా?

Updated : 08 Sep 2021 05:23 IST

ర్నాడు స్నేహితుడి పుట్టినరోజు. అర్ధరాత్రి 12 గంటలు దాటుతూనే మెసేజ్‌ పంపాలి. అప్పటివరకు మేల్కొని ఉంటామో లేదో. మధ్యలో నిద్ర ముంచుకొస్తే? అందరి కన్నా ముందే శుభాకాంక్షలు తెలపాలనే కోరిక అలాగే ఉండిపోతుంది. మరెలా? టెలిగ్రామ్‌ యాప్‌ ఉందిగా. ఇందులో మెసేజ్‌ను కచ్చితంగా ఎప్పుడు పంపాలో ముందే నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది మరి. ముందుగా టెలిగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. నిర్ణీత సమయానికి సందేశాన్ని పంపించాలనుకునేవారితో మాటామంతీ ఆరంభించాలి. మెసేజ్‌ను టైప్‌ చేయాలి. కావాలనుకుంటే ఫొటో, వీడియోనూ జతచేయొచ్చు. అనంతరం మెసేజ్‌ మీద కాసేపు అలాగే నొక్కి పట్టుకోవాలి. అప్పుడు షెడ్యూల్‌ మెసేజ్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. సెండ్‌ బటన్‌ మీద నొక్కి తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి. సరిగ్గా ఆ సమయానికి మెసేజ్‌ మిత్రుడికి అందుతుంది. ఈ ఫీచర్‌ ద్వారా అవతలి వాళ్లు ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడే మెసేజ్‌ను పంపించుకునే వెసులుబాటూ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని