ట్వీట్‌ ఎడిట్‌ చేయొచ్చా?

ట్విటర్‌లో ఏదో ట్వీట్‌ చేస్తాం. ఏదో అక్షర దోషం దొర్లింది. లేదూ తప్పుడు అర్థం ఉంది. దాన్ని డిలీట్‌ చేయొచ్చు. కానీ మళ్లీ అంతా తప్పులు లేకుండా టైప్‌ చేయటం కాస్త కష్టమైన పనే.

Published : 08 Sep 2021 01:09 IST

ట్విటర్‌లో ఏదో ట్వీట్‌ చేస్తాం. ఏదో అక్షర దోషం దొర్లింది. లేదూ తప్పుడు అర్థం ఉంది. దాన్ని డిలీట్‌ చేయొచ్చు. కానీ మళ్లీ అంతా తప్పులు లేకుండా టైప్‌ చేయటం కాస్త కష్టమైన పనే. ఇలాంటప్పుడే ట్వీట్లను సవరించుకునే వెసులుబాటు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంటుంది. సాంకేతికంగా ట్విటర్‌లో ఎడిట్‌ చేసే అవకాశం లేదు. కానీ రీపోస్ట్‌ ద్వారా సరిదిద్దుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం ముందుగా ప్రొఫైల్‌లోకి వెళ్లి రీపోస్ట్‌ చేయాలనుకునే ట్వీట్‌ను గుర్తించాలి. సందేశాన్ని కాపీ చేసుకొని, హోంస్క్రీన్‌లోకి వెళ్లి వాట్స్‌ హ్యాపెనింగ్‌ ద్వారా కొత్త పోస్ట్‌లో పేస్ట్‌ చేయాలి. తప్పులను సరిదిద్దుకొని పోస్ట్‌ చేయాలి. అనంతరం పాత ట్వీట్‌ను తొలగించాలి. ప్రొఫైల్‌లోకి వెళ్లి డిలీట్‌ చేయాలనుకునే ట్వీట్‌ను వెతికాలి. దీని పైన కుడివైపున అడ్డంగా ఉండే మూడు చుక్కలను నొక్కి, డిలీట్‌ చేయాలి. ఆ వెంటనే అది తొలగిపోతుంది. ట్విటర్‌లో ఎవరికీ కనిపించదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని