వారి ఫొటోలే ముందు

ఇన్‌స్టాగ్రామ్‌ వాడేవారు ఇకపై తమకు ఇష్టమైనవారి ఫొటోలు, వీడియోలే ముందుగా కనిపించేలా చూసుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌ ఫేవరెట్స్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా వినియోగదారులకు....

Published : 15 Sep 2021 01:42 IST

న్‌స్టాగ్రామ్‌ వాడేవారు ఇకపై తమకు ఇష్టమైనవారి ఫొటోలు, వీడియోలే ముందుగా కనిపించేలా చూసుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌ ఫేవరెట్స్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా వినియోగదారులకు తమ ఫీడ్‌లో ఏయే ఖాతాలు ముందుగా కనిపించాలో ఎంచుకోవటానికి వీలు కల్పించనుంది. ఇలా తమకు ఇష్టమైనవారు పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలు ముందుగా చూడాలని అనుకునేవారి చిరకాల వాంఛ తీరనుంది. ఫేస్‌బుక్‌ మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్టులు కనిపించటంపై లైక్స్‌, సేవ్‌, కామెంట్స్‌ వంటి రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. దీంతో కొన్నిసార్లు తమకు నచ్చినవారి ఫొటోలు, వీడియోలు అడుగుకు వెళ్లిపోవచ్చు. ఇలాంటి ఇబ్బందిని తప్పించటం కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో తమకు ఇష్టమైనవారి ఖాతాలను ఫేవరెట్స్‌గా ఎంచుకుంటే చాలు. వారి ఫీడ్‌ అన్నింటికన్నా ముందు దర్శనమిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని