జేవియర్‌.. ఓ పోలీసు రోబో

ఇదేదో చిత్రమైన జీపులా కనిపిస్తోంది కదా. నిజానికిదో రోబో. దీని పేరు జేవియర్‌. ఏదో మామూలు రోబో అనుకుంటున్నారేమో. పోలీసు రోబో. బహిరంగ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ కాయటానికి సింగపూర్‌ దీన్ని...

Updated : 15 Sep 2021 01:57 IST

దేదో చిత్రమైన జీపులా కనిపిస్తోంది కదా. నిజానికిదో రోబో. దీని పేరు జేవియర్‌. ఏదో మామూలు రోబో అనుకుంటున్నారేమో. పోలీసు రోబో. బహిరంగ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ కాయటానికి సింగపూర్‌ దీన్ని రూపొందించింది. మాస్కు ధరించకపోయినా, ఉమ్మినా, పొగ తాగినా, నిషిద్ధ ప్రాంతాల్లో వాహనాలు నిలిపినా ఇట్టే పసిగడుతుంది. వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. ఇటీవలే ఇలాంటి రెండు రోబోలతో అత్యంత రద్దీగా ఉండే చోట ప్రయోగాత్మక ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికివి ప్రజలకు ఎలా నడచుకోవాలో అనేదానిపై అవగాహన కలిగిస్తున్నాయి. మున్ముందు వీటిని చట్టపర చర్యలకూ వినియోగించుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని