పండు తొక్కే బ్యాండేజీ

ఒకవైపు వ్యర్థాల నివారణ. మరోవైపు పుండ్ల చికిత్స. సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు ఇలా రెండిందిలా మేలు చేసేలా కొత్తరకం బ్యాండేజీని సృష్టించారు. సింగపూర్‌లో డ్యూరియాన్‌ పండ్లను...

Updated : 29 Sep 2021 05:57 IST

కవైపు వ్యర్థాల నివారణ. మరోవైపు పుండ్ల చికిత్స. సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు ఇలా రెండిందిలా మేలు చేసేలా కొత్తరకం బ్యాండేజీని సృష్టించారు. సింగపూర్‌లో డ్యూరియాన్‌ పండ్లను ఎక్కువగా తింటుంటారు. దీని లోపలి కండను తినేసి, పొట్టును పారేస్తుంటారు. ఇది దేనికీ పనికిరాదు. దీన్నుంచే పరిశోధకులు కొత్తరకం యాంటీబ్యాక్టీరియల్‌ బ్యాండేజీని తయారుచేశారు. ముందుగా డ్యూరియాన్‌ తొక్క ముక్కలను ఎండించి, పొడి చేసి.. దీనికి గ్లిజరాల్‌ను కలిపి మెత్తటి జిగురుద్రవాన్ని (హైడ్రోజెల్‌) రూపొందించారు. దీన్ని పాత్రలో స్థిరంగా ఉంచితే కాస్త గట్టిపడుతుంది. అనంతరం  బ్యాండేజీల మాదిరిగా కత్తిరించుకోవచ్చు. మామూలు బ్యాండేజీలతో పోలిస్తే ఇవి పుండ్లను చల్లగా, మరింత తేమగా ఉంచుతాయి. దీంతో పుండ్లు త్వరగా మానతాయి. ఒక్క డ్యూరియాన్‌ తొక్కలతోనే కాదు. సోయా గింజలు, మద్యం బట్టీల్లో మిగిలిపోయే ధాన్యం వ్యర్థాలనూ హైడ్రోజెల్‌గా మార్చొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని