సిస్టమ్‌తోనే ఊడ్చేయండి!
రోడ్డు మీద పరుగెడుతున్నారు. అనుకోకుండా బురదలో కాలు పడింది. దాన్ని కడుక్కునేంతవరకు వేగంగా పరుగెత్తటం సాధ్యం కాదు కదా. కంప్యూటర్‌లో అనవసర ఫైళ్లు కూడా అంతే. అడుగడుగునా వేగానికి అడ్డుపడుతుంటాయి.....
రోడ్డు మీద పరుగెడుతున్నారు. అనుకోకుండా బురదలో కాలు పడింది. దాన్ని కడుక్కునేంతవరకు వేగంగా పరుగెత్తటం సాధ్యం కాదు కదా. కంప్యూటర్‌లో అనవసర ఫైళ్లు కూడా అంతే. అడుగడుగునా వేగానికి అడ్డుపడుతుంటాయి. అందుకే అప్పుడప్పుడూ సిస్టమ్‌లో జంక్ ఫైళ్లను శుభ్రం చేస్తూ ఉండటం మంచిది. పాత ఫొటోలు, వీడియోలే కాదు.. ప్రొగ్రామ్‌లు రన్ అవుతున్నప్పుడు డేటాను స్టోర్ చేసుకునే క్రమంలోనూ సిస్టమ్ కొన్ని తాత్కాలిక ఫైళ్లను సృష్టించుకుంటుంది. ఉదాహరణకు- ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంటును సేవ్ చేసేటప్పుడు ఏదో అవాంతరం ఎదురైందనుకోండి. కంప్యూటర్ దాన్ని బ్యాకప్‌లో తాత్కాలిక ఫైలుగా సేవ్ చేసి పెట్టుకుంటుంది. అత్యవసర సమయాల్లో ఇది ఉపయోగపడేదే అయినా రోజులు గడుస్తున్నకొద్దీ ఇలాంటి తాత్కాలిక ఫైళ్లు పెద్ద ఎత్తున పోగుపడుతుంటాయి. వీటిని తొలగించుకోవటానికి చాలామంది ఉచిత పీసీ క్లీనింగ్ ప్రోగ్రామ్‌లను వాడుతుంటారు. ఇవి అంత మంచివి కావు. యాడ్వేర్, వైరస్‌ల వంటి వాటినీ సిస్టమ్‌లో ప్రవేశపెట్టొచ్చు. వీటికన్నా కంప్యూటర్‌లోనే నిక్షిప్తమయ్యే టూల్స్‌ను ఉపయోగించుకోవటం మేలు. సిస్టమ్ అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దుతారు కాబట్టి బాగా ఉపకరిస్తాయి.
డిస్క్ క్లీనప్: స్టార్ట్ మెనూలో ‘డిస్క్ క్లీనప్’ అని టైప్ చేస్తే ఇది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి, క్లీన్ చేసుకోవాలని అనుకుంటున్న డ్రైవ్‌ను ఎంచుకోవాలి. అనవసర ఫైళ్లను వెతికి పెడుతుంది. క్లీన్ అప్ సిస్టమ్ ఫైల్స్ బటన్‌ను క్లిక్ చేస్తే వాటన్నింటినీ తొలగిస్తుంది.
స్టోరేజ్ సెన్స్: విండోస్ 10 సిస్టమ్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇది తనకు తానే స్పేస్‌ను ఫ్రీ చేస్తుంది. కంప్యూటర్‌లో స్పేస్ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తే దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది తాత్కాలిక, జంక్ ఫైళ్లను తొలగించేస్తుంది. రీసైకిల్ బిన్‌లో ఉన్నవాటినీ శుభ్రం చేస్తుంది. దీన్ని ఆన్ చేసుకోవాలంటే- ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లి, సిస్టమ్‌ను ఎంచుకోవాలి. అక్కడ్నుంచి స్టోరేజీని క్లిక్ చేసి, స్టోరేజీ సెన్స్‌ను టర్న్ ఆన్ చేసుకోవాలి.
రెడ్యూస్ క్లటర్: మ్యాక్ వాడేవారికి ‘రెడ్యూస్ క్లటర్’ బాగా ఉపయోగపడుతుంది. ఇది పెద్ద ఫైళ్లను, అనవసర ఫైళ్లను వెతికి చూపిస్తుంది. రివ్యూ ఫైల్స్ బటన్‌ను క్లిక్ చేసి, సైడ్ బార్‌లో ఫైల్ విభాగాన్ని ఎంచుకోవాలి. అనంతరం అనవసర ఫైళ్లను డిలీట్ చేయాలి. దీన్ని చేరుకోవాలంటే ముందుగా యాపిల్ మెనూలోకి వెళ్లి, అబౌట్ దిస్ మ్యాక్ ద్వారా స్టోరేజీని క్లిక్ చేయాలి. అనంతరం మ్యానేజ్ బటన్‌ను క్లిక్ చేస్తే రెడ్యూస్ క్లటర్ ఆప్షన్ కనిపిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/02/23)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం