
సూట్‌కేస్ గ్రామ్‌ఫోన్ ప్లేయర్
ఇంట్లో పెద్దవాళ్ల దగ్గర బోలెడన్ని గ్రామ్‌ఫోన్ రికార్డులున్నాయా? తరచూ వాటిని చూసి నిట్టూరుస్తుండటం గమనించారా? మరి వాళ్లను సంతోష పెట్టటమెలా? క్లా స్టాగ్ పోర్టబుల్ వినైల్ రికార్డు ప్లేయర్‌ను చేతికిచ్చి చూడండి. మనమిప్పుడు స్పోటిఫై, యాపిల్ మ్యూజిక్ యుగంలో ఉన్నమాట నిజమే అయినా పాతతరం గ్రామ్‌ఫోన్ రికార్డులు, టర్న్టేబుళ్లు తిరిగి ఊపందుకుంటున్నాయి. వేడుకల్లో అందరి దృష్టిని ఆకరిస్తున్నాయి. పాత సంగతులను నెమరు వేసుకోవటానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. క్లా స్టాగ్ పోర్టబుల్ వినైల్ రికార్డు ప్లేయర్‌ను మూసేసినప్పుడు సూట్‌కేస్‌లా కనిపిస్తుంది. సూట్‌కేస్ మాదిరిగానే దీన్ని కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. కావాలంటే మిత్రులకూ అరువు ఇవ్వచ్చు. పాతకాలపు వాసన వేసినా ఇది పూర్తిగా అధునాతనమైంది. బ్లూటూత్‌తో కూడిన ఇతర పరికరాలతోనూ అనుసంధానమవుతుంది. హోం సిస్టమ్, స్పీకర్లు, హెడ్ఫోన్లకు అనువైంది కూడా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.