సౌర వ్యవస్థ ‘శిలాజ’ అన్వేషణలో..

సుదూర గ్రహశకలాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా ఓ వ్యోమనౌకను ప్రయోగించింది. సౌర వ్యవస్థ ‘శిలాజాల’ గుట్టు పసిగట్టటం దీని ఉద్దేశం.

Updated : 20 Oct 2021 06:16 IST

సుదూర గ్రహశకలాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా ఓ వ్యోమనౌకను ప్రయోగించింది. సౌర వ్యవస్థ ‘శిలాజాల’ గుట్టు పసిగట్టటం దీని ఉద్దేశం. ఆఫ్రికాలో లభించిన లూసీ అనే మానవ శిలాజం మనం ఎక్కడ్నుంచి వచ్చామనే దానిపై ఎంతో సమాచారాన్ని అందించింది. అందుకే ఈ ఉపగ్రహానికీ అదే పేరు పెట్టారు. ఇది గురుగ్రహం సమీపంలోని ఏడు ట్రోజన్‌ గ్రహశకలాలతో (సౌరవ్యవస్థ ఏర్పడిన తొలిరోజుల్లో మిగిలిపోయిన ముక్కలు) పాటు బోలెడన్ని గ్రహ శకలాలను పరిశీలించనుంది. ట్రోజన్‌ గ్రహ శకలాలను సౌర వ్యవస్థ శిలాజాలుగా భావిస్తారు. ఎందుకంటే వీటిల్లో సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలు దాగున్నాయి మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని