కొందరికే ప్రొఫైల్‌ ఫొటో..

మల్టీ-డివైస్‌ సపోర్టు, క్లౌడ్‌లో చాట్‌ బ్యాకప్స్‌, ప్రత్యేక ప్రైవసీ సెటింగ్స్‌ వంటి వాటిని ప్రవేశపెట్టిన వాట్సప్‌ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను జోడించనుంది. ఎంచుకున్న కాంటాక్టు నంబర్లకు ‘అబౌట్‌’ సెక్షన్‌

Published : 20 Oct 2021 03:29 IST

ల్టీ-డివైస్‌ సపోర్టు, క్లౌడ్‌లో చాట్‌ బ్యాకప్స్‌, ప్రత్యేక ప్రైవసీ సెటింగ్స్‌ వంటి వాటిని ప్రవేశపెట్టిన వాట్సప్‌ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను జోడించనుంది. ఎంచుకున్న కాంటాక్టు నంబర్లకు ‘అబౌట్‌’ సెక్షన్‌ కనిపించకుండా చేయటం దీని ప్రత్యేకత. ప్రొఫైల్‌ ఫొటోలు చూసే అనుమతి ఇవ్వటానికి ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌..’ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నట్టు వాట్సప్‌ బీటా వర్షన్ల నుంచి లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో ఏవైనా కాంటాక్టు నంబర్లను ఎంచుకుంటే వారికి మన ప్రొఫైల్‌ ఫొటో కనిపించదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నోబడీ, ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌ ఫీచర్లకు తోడు ఇకపై ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ ఎంచుకునే అవకాశమూ లభిస్తుంది. ఈ ఫీచర్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది కచ్చితంగా తెలియదు గానీ ఔత్సాహికులు ఏపీకేమిర్రర్‌ వంటి నమ్మకమైన సోర్స్‌ ద్వారా బీటా వర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ బీటా ప్రోగ్రామ్‌ల కోసం నమోదు అవకాశాలు నిండుకున్నాయి. మరిన్ని స్లాట్‌లు అందుబాటులోకి వచ్చేంతవరకు నమోదు సాధ్యం కాదు. కాకపోతే కొత్త సెటింగ్స్‌ వివరాలు బయటకు పొక్కినందున రేపో మాపో ఇది అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని