ఇక అందరూ‘స్పేసెస్‌’ హోస్ట్‌లే

ఇటీవల ట్విటర్‌ ప్రవేశపెట్టిన ఆడియో చాట్‌రూమ్‌ ‘స్పేసెస్‌’ రోజురోజుకీ ఆదరణ పొందుతోంది. కాబట్టే దీన్ని మరింత విస్తృతం చేయటంపై ట్విటర్‌ దృష్టి సారించింది. స్పేసెస్‌ హోస్ట్‌గా....

Published : 27 Oct 2021 01:58 IST

టీవల ట్విటర్‌ ప్రవేశపెట్టిన ఆడియో చాట్‌రూమ్‌ ‘స్పేసెస్‌’ రోజురోజుకీ ఆదరణ పొందుతోంది. కాబట్టే దీన్ని మరింత విస్తృతం చేయటంపై ట్విటర్‌ దృష్టి సారించింది. స్పేసెస్‌ హోస్ట్‌గా ఇకపై అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయించింది. సాధారణంగా ఏదైనా ఆడియో సమావేశాన్ని ఆరంభించాలని భావించేవారు ముందుగా హోస్ట్‌గా స్పేస్‌ను సృష్టించుకొని, ఇతరులకు ఆహ్వానం పలుకుతారు. ఇష్టమున్నవారు దానికి కనెక్ట్‌ అయ్యి భేటీలో పాల్గొంటారు. ఇప్పటివరకూ కనీసం 600 మంది ఫాలోవర్లు ఉన్నవారికే ఇలా హోస్టింగ్‌ చేసే అవకాశముండేది. ఇకపై ఫాలోవర్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎవరైనా స్పేసెస్‌ సమావేశాన్ని ఆరంభించటానికి వీలుంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలు వాడేవారందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ఐఓఎస్‌ పరికరాలు వాడేవారికైతే అదనంగా ‘టికెటెడ్‌ స్పేసెస్‌’ వెసులుబాటు కూడా దక్కనుంది. దీంతో హోస్ట్‌లు తమ ప్రత్యక్ష ఆడియో కార్యక్రమాలను అమ్ముకోవచ్చు. అంటే ఇందులో పాల్గొనాలని అనుకునేవారు టికెట్‌ కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని