జూమ్‌లో ప్రత్యక్ష అనువాదం!

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో జూమ్‌ సమావేశాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఎక్కడ్నుంచైనా, ఎవరితోనైనా ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడుకోవటం తేలికైపోయింది. మరి అవతలి ...

Published : 27 Oct 2021 01:58 IST

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో జూమ్‌ సమావేశాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఎక్కడ్నుంచైనా, ఎవరితోనైనా ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడుకోవటం తేలికైపోయింది. మరి అవతలి వారి భాష అర్థం కాకపోతే? ఇబ్బందే కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అప్పటికప్పుడు అనువాదం చేసే వెసులుబాటు కల్పించటంపై జూమ్‌ దృష్టి సారించింది. మొత్తం 12 భాషలను ఇలా అనువాదం చేసి పెట్టాలని సంకల్పించింది. అంతేకాదు.. 30 భాషలను ఆటోమేటెడ్‌ ట్రాన్స్‌క్ప్రిషన్‌ రూపంలో కనిపించేలా చేయాలనీ భావిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే మరో ఏడాదిలోనే ఇది సాకారం కానుంది. వివిధ దేశాల మధ్య, భాషల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్న తరుణంలో ఇలాంటి అనువాదం, ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడతాయనటం నిస్సందేహం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని