అంతరిక్ష వ్యర్థాల నిర్మూలనకు చైనా ఉపగ్రహం

అంతరిక్ష వ్యర్థాలను తగ్గించటానికి చైనా కొత్త ప్రయత్నం ఆరంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని పేరు షిజన్‌-21. ఇది అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే పరిజ్ఞానాలను పరీక్షించి, ధ్రువీకరించనుంది.

Updated : 03 Nov 2021 05:43 IST

అంతరిక్ష వ్యర్థాలను తగ్గించటానికి చైనా కొత్త ప్రయత్నం ఆరంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని పేరు షిజన్‌-21. ఇది అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే పరిజ్ఞానాలను పరీక్షించి, ధ్రువీకరించనుంది. అయితే దీని వివరాలు, సామర్థ్యాలు ఏంటన్నది ఇంకా వెల్లడి కాలేదు. రోజురోజుకీ అంతరిక్ష వ్యర్థాలు పెరిగిపోతున్న తరుణంలో చైనా ఈ కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించటం గమనార్హం. ఇప్పటివరకు 40కి పైగా దేశాలు 8,950 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాయి. సుమారు 5వేల ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతున్నాయి. అయితే వీటిల్లో అత్యధిక ఉపగ్రహాల కాలం దగ్గరపడింది. కేవలం 1,950 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావన్నీ వ్యర్థాలుగానే మిగిలిపోయాయి. ఇవి ప్రస్తుతం పనిచేస్తున్న ఉపగ్రహాలను ఎప్పుడైనా ఢీకొట్టొచ్చు. దీంతో తీవ్ర ప్రమాదం వాటిల్లొచ్చు. ఇటీవల రష్యా పాత ఉపగ్రహానికి సంబంధించిన ముక్క ఒకటి చైనా ఉపగ్రహాన్ని ఢీకొట్టినట్టు బయటపడింది. అందుకే ఎన్నో సంస్థలు అంతరిక్ష వ్యర్థాల నిర్మూలన మీద దృష్టి సారించాయి. తాజా చైనా ప్రయత్నం ఎంతవరకు సమస్యకు పరిష్కారం చూపుతుందో కాలమే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని