
వేడి మంచు!
మంచు చల్లగా ఉంటుంది. వేడిగా.. అదీ సూర్యుడి ఉపరితలం కన్నా ఎక్కువ వేడిగా ఉంటే? మామూలు వేడికే మంచు కరిగిపోతుంది కదా. అంత వేడిగా ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? తీవ్రమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో మంచు ఇలాంటి భిన్నమైన స్థితిలోనూ ఉంటుంది. దీన్నే సూపర్అయోనిక్ మంచు అంటారు. ద్రవం, మంచు, ఆవిరి.. ఇలా నీటికి సంబంధించిన 19 రూపాల్లో ఇదొకటి. పెద్ద పెద్ద గ్రహాల భూకేంద్రంలో ఇది సుసాధ్యమే. ఇందులో నీటి అణువులు విడిపోయి, ఆక్సిజన్ అయాన్లు స్ఫటికాలుగా మారుతుంది. ఈ ఘన పదార్థం రంధ్రాల మధ్య హైడ్రోజన్ అయాన్లు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఇవే నీటిని లోహం మాదిరిగా గట్టిగా ఉండేలా చేస్తాయి. అప్పడది గొప్ప విద్యుత్ వాహకంగానూ పనిచేస్తుంది. ఇప్పటివరకూ ఇది సిద్ధాంతానికే పరిమితమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీ.. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకులు తాజాగా లేజర్ల సాయంతో దీన్ని సృష్టించి నిజమేనని నిరూపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.