రోబోల సందడి
రోబోలు నెమ్మదిగా మనుషుల ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయా? అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో రోబోల సందడిని చూస్తుంటే ఇలాంటి సందేహం కలగటం ఖాయం. ఒకటి కాదు, రెండు కాదు..
రోబోలు నెమ్మదిగా మనుషుల ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయా? అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో రోబోల సందడిని చూస్తుంటే ఇలాంటి సందేహం కలగటం ఖాయం. ఒకటి కాదు, రెండు కాదు.. అక్కడ వందకు పైగా రోబోలు నిర్ణయించిన పనులు తమకు తామే చేసుకుంటూ పోతున్నాయి. బల్లలు తుడవటం, చెత్తను సేకరించటం దగ్గర్నుంచి కప్పులు పట్టుకోవటం, తలుపులు తెరవటం వరకూ బోలెడన్ని పనులతో ఆశ్చర్యం గొలుపుతున్నాయి. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కు చెందిన ఎక్స్‌పెరిమెంటల్ ఎక్స్ ల్యాబ్స్ ‘ఎవ్రీడే రోబోస్’ ప్రాజెక్టు కింద వీటిని రూపొందించాయి. అల్ఫాబెట్ సంస్థ ఐదేళ్లుగా వివిధ రకాల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్లను తయారు చేయటం మీద దృష్టి సారించింది. వీటిని ఇప్పుడు కార్యాచరణలో పెట్టింది. వందకు పైగా ప్రయోగాత్మక రోబోలు ఇప్పటికే ఎన్నో పనులు నిర్వహిస్తున్నాయి. ఒకో రోబో ఒకటే పని కాదు. మరెన్నో పనులు చేయగలదు. చెత్తను ఊడ్చే రోబో బల్లలనూ తుడవగలదు. కప్పులను పట్టుకునే రోబో తలుపులనూ తెరవగలదు. ఇలాంటి పనులు చేయటానికి వీటికి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లను అనుసంధానం చేశారు. చుట్టుపక్కల పరిసరాలను గుర్తించి, పనులు చేయటానికి వీలుగా వివిధ రకాల కెమెరాలు, సెన్సార్లను రోబోలకు జోడించారు. ఇవి మెషిన్ లెర్నింగ్ ద్వారా క్రమంగా ఆయా పనులు నేర్చుకోవటం విశేషం. తేలికైన పనులే కాదు.. మున్ముందు కుర్చీలు మడత పెట్టటం వంటి సంక్లిష్టమైన పనులు చేసేలా వీటిని తీర్చిదిద్డటం మీదా దృష్టి సారించారు.
టీకా ఇచ్చే రోబో
ఈ రోబోను చూస్తున్నారా? దీని పేరు కోబీ. దీని ప్రత్యేకతేంటో తెలుసా? తనకు తానే కండరానికి టీకా ఇచ్చేస్తుంది. అదీ సూది గుచ్చకుండానే. అత్యధిక పీడనంతో బలంగా నెట్టటం ద్వారా ఇది చర్మంలోకి టీకా మందు వెళ్లేలా చేస్తుంది మరి. కెనడా అంకురసంస్థ ఒకటి దీన్ని తయారుచేసింది. టీకా తీసుకునేవారు దీని ముందుకు వెళ్లి, రోబో మానిటర్‌కు గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. అప్పుడది వారి వివరాలను నమోదు చేసుకొని, ఆయా వ్యక్తుల శరీర పటాన్ని రూపొందించు కుంటుంది. కృత్రిమ మేధ సాయంతో టీకా ఇవ్వటానికి అనువైన చోటును గుర్తిస్తుంది. టీకా తీసుకునేవారు దూదితో చర్మాన్ని రుద్దుకున్నాక, తన పొడవైన చేతిని చాచి టీకా ఇచ్చేస్తుంది. స్వయంచాలిత వాహనాలు దారిని గుర్తించానికి ఉపయోగించుకునే లిడర్ పరిజ్ఞాన గ్రాహకాలతోనే ఇదీ పనిచేస్తుంది. మనుషుల ప్రమేయమేమీ లేకుండానే టీకాలు ఇచ్చే అవకాశముండటంతో మారుమూల ప్రాంతాలకు కోబీ ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sujana chowdary: భాజపా అధిష్ఠానంతో పవన్ చర్చలు జరిపారు: సుజనా చౌదరి
-
Crime News
Hyderabad: ఈతకు దిగి వ్యక్తి మృతి.. మునిగిపోతున్న దృశ్యాలు వైరల్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Sarath chandra reddy: దిల్లీ మద్యం కేసు.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి
-
Sports News
AUS vs IND: ఆసీస్‌కు ఎక్కువగా వారిద్దరి గురించే ఆందోళన : రికీ పాంటింగ్
-
India News
Manipur Violence: ‘వెంటనే ఆయుధాలు అప్పగించండి.. లేదో’: అమిత్ షా గట్టి వార్నింగ్