
ట్విటర్లో ఎమోజీ రియాక్షన్లు
ట్విటర్లో ఏదైనా ట్వీట్ నచ్చితే లైక్ చేస్తాం. కావాలంటే కామెంట్ బాక్స్ ద్వారా వ్యాఖ్యానిస్తాం. అయితే అన్నిసార్లూ మన ప్రతిస్పందనను టైప్ చేయటానికి వీలు కాకపోవచ్చు. ఆయా ట్వీట్లు ఎంతగా నచ్చాయో తెలియజేసే సమయం ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులను తొలగించటానికే రియాక్షన్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టటంపై ట్విటర్ దృష్టి సారించింది. దీంతో ఎమోజీల రూపంలో ప్రతిస్పందనను తెలియజేయొచ్చు. ఈ ఫీచర్‌పై కొన్ని నెలలుగా పరీక్షలు జరుపుతోంది. టియర్స్ ఆఫ్ జాయ్.. థింకింగ్ ఫేస్.. క్లాపింగ్ హ్యాండ్స్.. క్రైయింగ్ ఫేస్, గుండె.. ఇలా ఐదు రకాల ఎమోజీలకు వీలు కల్పించనుంది. ఇవి ట్వీట్ ఫీడ్ కింద దర్శనమిస్తాయి. కన్వర్జేషన్తో తమకు కలిగిన అనుభూతిని మరింత బాగా, స్పష్టంగా వెలిబుచ్చటానికివి తోడ్పడగలవని భావిస్తున్నారు. అలాగే ఐఓఎస్ పరికరాల్లో డౌన్ఓటు ఫీచర్ మీదా ట్విటర్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతానికి ఈ డౌన్ఓట్లు అందరికీ కనిపించవు. అప్ఓట్లు మాత్రం లైకుల రూపంలో కనిపిస్తాయి. సామాజిక మాధ్యమాల్లో దీన్ని చాలామంది ‘డిస్లైక్’ బటన్‌గా భావిస్తున్నారు. అయితే దీని ఉద్దేశం అది కాదని ట్విటర్ పేర్కొంది. కన్వర్జేషన్లో మంచి జవాబులు ఇస్తున్నారా? లేదా? అనేది తెలుసుకోవటానికి చేస్తున్న ప్రయత్నమేనని వివరించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.