వృక్ష వ్యర్థాలతో ప్లాస్టిక్‌!

ప్లాస్టిక్‌ తయారీకి వృక్షాలను వాడుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వీటిల్లో పెద్దమొత్తంలో ఉండేది చక్కెరలే. పెట్రోలు నుంచి లభించే అణువులేవీ ఉండవు.

Updated : 08 Dec 2021 06:24 IST

ప్లాస్టిక్‌ తయారీకి వృక్షాలను వాడుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వీటిల్లో పెద్దమొత్తంలో ఉండేది చక్కెరలే. పెట్రోలు నుంచి లభించే అణువులేవీ ఉండవు. మొక్కల్లోని చక్కెరల్లో ప్రధానమైంది గ్లూకోజు. ఇందులో ఆక్సిజన్‌ పెద్ద మొత్తంలో ఉంటుంది. కర్బనాలు ఉన్నా చాలా చిన్నగా ఉంటాయి. వీటిని పరిష్కరిస్తే గానీ ప్లాస్టిక్‌ తయారీ సాధ్యం కాదు. ఇందుకోసం గ్లూకోజు నుంచి ఆక్సిజన్‌ను తొలగించి, అణువులను సంయోగం చేయాల్సి ఉంటుంది. దీన్ని సాధించటానికే అమెరికాకు చెందిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ పులియబెట్టే, రసాయన శుద్ధి పద్ధతులను జోడించి కొత్త ప్రక్రియను రూపొందించింది. ఇందులో ముందుగా వృక్షాల నుంచి తీసిన గ్లూకోజును సూక్ష్మక్రిముల ద్వారా పులియబెడతారు. దీంతో ఆక్సిజన్‌ తొలగిపోతుంది. తర్వాత లోహ ఆక్సైడ్‌ ప్రేరేపకాల సాయంతో మిగతా ఆక్సిజన్‌నూ తొలగిస్తారు. దీంతో ఇది పెట్రోలియం వంటి ద్రవంగా మారుతుంది. దీన్ని ప్లాస్టిక్‌ తయారీలో పెట్రోలియం ఉత్పత్తులకు బదులుగా వాడుకోవచ్చు. ప్లాస్టిక్‌ డబ్బాలు, బ్యాగులు, ఆటోమొబైల్‌ భాగాలు, లుబ్రికేంట్లు, సబ్బుల వంటి వాటి తయారీలో ఉపయోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని