ఇ-పాన్‌ కార్డు భరోసా

ఆర్థిక సేవలు పొందటం, ఆదాయపన్ను రిటర్నుల దాఖలు.. ఇలా ఎన్నెన్నో పనులకు పాన్‌ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపటానికిది తప్పనిసరి.

Updated : 08 Dec 2021 06:20 IST

ర్థిక సేవలు పొందటం, ఆదాయపన్ను రిటర్నుల దాఖలు.. ఇలా ఎన్నెన్నో పనులకు పాన్‌ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపటానికిది తప్పనిసరి. అయితే ప్రతీసారి దీన్ని వెంట తీసుకెళ్లటం కుదరకపోవచ్చు. కొన్నిసార్లు పోగొట్టుకోవచ్చు కూడా. మరెలా? భయం లేదు. ఆన్‌లైన్‌లో ఇ-పాన్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి. దీన్ని ఫోన్‌లోనే భద్రపరచు కోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. వాడుకోవచ్చు. ఒకవేళ పాన్‌ కార్డు పోయినట్టయితే కొత్త కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి 10 నిమిషాలు చాలు. కాకపోతే కేవైసీని పూర్తి చేయటానికి ఆధార్‌ కార్డు ఉండాలి. ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. డౌన్‌లోడ్‌ ఇ-పాన్‌ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి. తర్వాత పాన్‌ కార్డు నంబరు, ఆధార్‌ కార్డు నంబరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి.. నిబంధనలు, షరతులను అంగీకరించాలి. అనంతరం నమోదిత ఫోన్‌ నంబరుకు అందే ఓటీపీని ఎంటర్‌ చేసి, కన్‌ఫర్మ్‌ బటన్‌ను నొక్కాలి. తర్వాత రూ.8.26 రుసుము చెల్లించి, పీడీఎఫ్‌ రూపంలో ఇ-పాన్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనికి పుట్టిన తేదీ పాస్‌వర్డ్‌గా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని