ముల్లు గడియారం సమయాన్నీ చెప్పేలా..

గడియారం ముల్లులను చూసి మనం ఇట్టే టైం చెప్పేస్తాం. అన్ని పనులను తేలికగా చేసే కంప్యూటర్లకు మాత్రం ఇది కష్టం. డిజిటల్‌ గడియారంలోని అంకెలను బట్టి సమయాన్ని గుర్తిస్తాయి గానీ ముల్లు గడియారం సమయాన్ని పోల్చుకోవటం రాదు

Updated : 15 Dec 2021 05:40 IST

డియారం ముల్లులను చూసి మనం ఇట్టే టైం చెప్పేస్తాం. అన్ని పనులను తేలికగా చేసే కంప్యూటర్లకు మాత్రం ఇది కష్టం. డిజిటల్‌ గడియారంలోని అంకెలను బట్టి సమయాన్ని గుర్తిస్తాయి గానీ ముల్లు గడియారం సమయాన్ని పోల్చుకోవటం రాదు. ఎందుకంటే ముల్లు గడియారాల ఆకారాలు ఒకేలా ఉండవు. తిరిగే ముల్లులు, వాటి నీడలు తరచూ మారిపోతుంటాయి. దీంతో వీటి సమయాన్ని గుర్తించటానికి ఇబ్బంది పడుతుంటాయి. అలాగని శాస్త్రవేత్తలు ఊరుకుంటారా ఏం? వీటికీ ముల్లు గడియారంలోని టైమ్‌ను కచ్చితంగా కనిపెట్టే విద్య నేర్పించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన చారింగ్‌ యాంగ్‌ బృందం దీన్ని సుసాధ్యం చేసింది. కంప్యూటర్‌లో వివిధ కోణాల్లో గడియారం దృశ్యాలను సృష్టించి, కృత్రిమ మేధ సాయంతో కంప్యూటర్‌ విజన్‌కు శిక్షణ ఇచ్చారు. దీంతో గడియారం దృశ్యాలు వేర్వేరు కోణాల్లో ఉన్నప్పటికీ కంప్యూటర్లు వాటిని నేరుగా చూడటం నేర్చుకున్నాయి. నిమిషాలు, గంటల ముల్లులను సరిగా గుర్తించి.. కచ్చితంగా సమయాన్ని గుర్తించటం అలవాటు చేసుకున్నాయి. ఈ పరిజ్ఞానాన్ని ముల్లులతో కూడిన ఎలాంటి యంత్రాలకైనా వినియోగించుకోవచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని