వ్యాయామ అద్దం!

ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవటానికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాయామ నిపుణుల సమక్షంలో చేస్తే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. మనం ఏవైనా తప్పులు చేస్తుంటే నిపుణులు వెంటనే సరిదిద్దుతారు.

Updated : 29 Dec 2021 04:23 IST

రోగ్యాన్ని కాపాడుకోవటానికి, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవటానికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాయామ నిపుణుల సమక్షంలో చేస్తే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. మనం ఏవైనా తప్పులు చేస్తుంటే నిపుణులు వెంటనే సరిదిద్దుతారు. కానీ అన్నిసార్లూ నిపుణుల వద్దకు, జిమ్‌లకు వెళ్లటం కుదరకపోవచ్చు. మరెలా? ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికే హైదరాబాద్‌కు చెందిన పోర్టల్‌ సంస్థ స్మార్ట్‌ మిర్రర్‌ను రూపొందించింది. ఇది వ్యక్తిగత ఫిట్‌నెస్‌ శిక్షకుడిగా పనిచేస్తుంది. రోజులో ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. 43 అంగుళాల 4కే తెర గల దీన్ని అద్దంలాగా గోడకు తగిలించుకోవచ్చు. కావాలంటే స్టాండ్‌తో నేల మీద నిలబెట్టుకోవచ్చు. జిమ్‌కు వెళ్లినప్పుడు అద్దంలో భంగిమను చూస్తూ వ్యాయామం చేస్తుంటాం కదా. స్మార్ట్‌ మిర్రర్‌లోనూ మన నిలువెత్తు రూపాన్ని చూసుకుంటూ వ్యాయామం చేయొచ్చు. అలాగని ఇదేమీ మామూలు అద్దం కాదు. బయో సెన్సర్లు, హెచ్‌డీ కెమెరాతో కూడుకొని ఉండే ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. వైఫై, బ్లూటూత్‌తో అనుసంధానమవుతుంది. సెన్సర్ల ద్వారా శరీర భంగిమను పసిగడుతూ ఎక్కడైనా తప్పు చేస్తుంటే సరిచేసుకోవాలని చెబుతుంది. ఆయా వ్యక్తులకు అనుగుణమైన వ్యాయామాలను ఇందులో ఎంచుకోవచ్చు. ఇందులో ప్రత్యక్ష శిక్షణ తరగతులకూ వీలుంటుంది. నిపుణులను చూస్తూ సాధన చేయొచ్చు. రకరకాల వ్యాయామాలతో పాటు యోగా, ధ్యానం, పోషకాహారం వంటి వాటి మీదా శిక్షణ పొందొచ్చు. దీనిలోని బయోసెన్సర్ల మూలంగా రక్తపోటు, గ్లూకోజు, ఈసీజీ, శ్వాసవేగం వంటి వివరాలూ తెర మీద కనిపిస్తాయి. వీటి ద్వారా మొత్తంగా ఆరోగ్యం ఎలా ఉందో బయటపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని