చెక్క ఉపగ్రహం

చెక్కతో ఉపగ్రహం! వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటొమో ఫారెస్ట్రీ కంపెనీ బృందం ఇలాంటి పనినే చేపట్టింది. దీని వెలుపలి భాగం పూర్తిగా చెక్కతోనే తయారుచేస్తారు మరి. అంతరిక్షంలో

Published : 05 Jan 2022 00:35 IST

చెక్కతో ఉపగ్రహం! వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటొమో ఫారెస్ట్రీ కంపెనీ బృందం ఇలాంటి పనినే చేపట్టింది. దీని వెలుపలి భాగం పూర్తిగా చెక్కతోనే తయారుచేస్తారు మరి. అంతరిక్షంలో పని ముగిశాక భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఉపగ్రహం మండిపోవటానికిది వీలు కల్పిస్తుంది. దీంతో పర్యావరణానికి పెద్దగా హాని కలగదు. పైగా ఇది అల్యూమినియం కన్నా చవక. అందువల్ల తక్కువ ధరలోనే రూపొందించొచ్చు. చెక్కలోకి విద్యుదయస్కాంత తరంగాలు ప్రవేశిస్తాయి కాబట్టి యాంటెన్నాల వంటి భాగాలను ఉపగ్రహం లోపలే అమర్చుకోవచ్చు. ఈ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాదిలో ప్రయోగించాలని భావిస్తున్నారు. ఇది విజయవంతమైతే అంతరిక్షం మీద ఆసక్తి ఉన్న పిల్లలు సైతం ఉపగ్రహాలను తయారు చేయగలరని ఆశిస్తున్నారు. ఒక వైపున 10 సెంటీమీటర్ల వెడల్పుతో ఇది చతురస్రాకారంలో ఉంటుంది. వెలుపలి వైపున చెక్కతో పాటు సౌర ఫలకాలూ అమర్చి ఉంటాయి. దీంతో అవసరమైన విద్యుత్తును అదే సొంతంగా తయారుచేసుకోగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని