పొడవైన దారం బ్యాటరీ

ఆ దారాన్ని స్మార్ట్‌వాచీల వంటివాటికి చుట్టుకోవచ్చు. ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. అది మామూలు దారం కాదు. పొడవైన బ్యాటరీ మరి. ఇలాంటి వినూత్నమైన లిథియం అయాన్‌ బ్యాటరీనే పరిశోధకులు రూపొందించారు. రీఛార్జ్‌ కాగల ...

Published : 05 Jan 2022 00:35 IST

దారాన్ని స్మార్ట్‌వాచీల వంటివాటికి చుట్టుకోవచ్చు. ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. అది మామూలు దారం కాదు. పొడవైన బ్యాటరీ మరి. ఇలాంటి వినూత్నమైన లిథియం అయాన్‌ బ్యాటరీనే పరిశోధకులు రూపొందించారు. రీఛార్జ్‌ కాగల దీన్ని వస్త్రాలకు, స్మార్ట్‌వాచీల వంటి ధరించే పరికరాలకు వాడుకోవచ్చు. 3డీ ముద్రిత బ్యాటరీలు తయారు చేయటానికీ ఉపయోగించుకోవచ్చు. జిగురు ద్రవాలు, పోగులను తయారుచేసే వ్యవస్థల సాయంతో ఈ కొత్తరకం బ్యాటరీని రూపొందించారు. ముడి పదార్థాలను పెద్ద పాత్రలో పోసి, వాటిని దాదాపు కరిగే స్థాయికి వచ్చేవరకు వేడిచేసి.. సన్నటి రంధ్రం ద్వారా బయటకు లాగుతూ రూపొందించారు. అంటే నూలును వడికి దారాన్ని తయారు చేసినట్టు అన్నమాట. ఇలా దారం మాదిరిగా అతి పొడవైన.. 140 మీటర్ల పొడవైన బ్యాటరీని సృష్టించి, రికార్డు నెలకొల్పారు. ఇందులోని విడిభాగాలన్నీ చెదిరిపోకుండా అదే క్రమంలో ఉండేలా చూడటం విశేషం. ఇది 123 మిల్లీయాంప్‌ గంటల వరకు శక్తిని నిల్వ ఉంచుకోగలదు. దీని సామర్థ్యాన్ని మరింత పెంచటానికీ ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని