ఇష్టమైన సంగీతంతో వీడియో రికార్డింగ్‌

మ్యూజిక్‌ ప్లే అవుతుండగా ఐఫోన్‌లో వీడియో రికార్డు చేయటం కష్టం. కెమెరా యాప్‌లో వీడియో మోడ్‌ను ఆన్‌ చేయగానే మ్యూజిక్‌ ఆగిపోతుంది. దీనికి కారణం వీడియో మోడ్‌ స్విచాన్‌ కాగానే ప్లే అవుతున్న ఆడియోను ఐఫోన్‌ గుర్తించటమే. కెమెరా

Updated : 26 Jan 2022 05:47 IST

మ్యూజిక్‌ ప్లే అవుతుండగా ఐఫోన్‌లో వీడియో రికార్డు చేయటం కష్టం. కెమెరా యాప్‌లో వీడియో మోడ్‌ను ఆన్‌ చేయగానే మ్యూజిక్‌ ఆగిపోతుంది. దీనికి కారణం వీడియో మోడ్‌ స్విచాన్‌ కాగానే ప్లే అవుతున్న ఆడియోను ఐఫోన్‌ గుర్తించటమే. కెమెరా యాప్‌లోంచి బయటకు వచ్చేంతవరకు ఆడియో నిలిచే ఉంటుంది. వీడియోలకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ జతచేయాలని అనుకునేవారికిది చికాకు తెప్పిస్తుంది. కానీ కొన్ని చిట్కాలతో మనకు ఇష్టమైన బ్యాక్‌గ్రౌండ్‌ ఆడియోతోనే వీడియోను చిత్రీకరించుకునే అవకాశముంది.

ముందుగా ఫోన్‌లో మ్యూజిక్‌ ప్లే చేసి, కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత నేరుగా వీడియో విభాగానికి కాకుండా ఫొటో సెక్షన్‌లోకి వెళ్లి ఫోన్‌ను కెమెరా మోడ్‌లో ఉంచుకోవాలి. వెనకాల మ్యూజిక్‌ ప్లే అయ్యేలా చూసుకోవాలి.

ఫొటో తీయటానికి వాడే వైట్‌ షటర్‌ను నొక్కి పట్టుకోవాలి. షటర్‌ను అలాగే నొక్కి పట్టుకొని కిందికి గానీ కుడివైపునకు గానీ డ్రాగ్‌ చేయాలి. అప్పుడు బటన్‌ లాక్‌ అయ్యి వీడియో రికార్డు అవటం మొదలవుతుంది. అదే సమయంలో వెనకాల నడిచే మ్యూజిక్‌ కూడా వీడియోకు జతకూడుతుంది.

వీడియో తీయటం ముగిశాక తెర మధ్యలో కనిపించే ఎరుపు చదరం మీద ట్యాప్‌ చేయాలి. దీంతో రికార్డింగ్‌ ఆగిపోయి, సేవ్‌ అవుతుంది. ఇష్టమైన సంగీతంతో కూడిన వీడియో చూసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని