వాట్సప్‌ గ్రూప్‌లో మరో కొత్త ఫీచర్‌

వాట్సప్‌ గ్రూప్‌లో ఎవరో ఏదో మెసేజ్‌ పెట్టారు. అది అభ్యంతరకరంగా ఉంది. అయినా సభ్యులు తొలగించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్‌ అడ్మిన్లకే  మెసేజ్‌లను తొలగించే సదుపాయం ఉంటే? త్వరలో వాట్సప్‌ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.

Published : 02 Feb 2022 01:10 IST

వాట్సప్‌ గ్రూప్‌లో ఎవరో ఏదో మెసేజ్‌ పెట్టారు. అది అభ్యంతరకరంగా ఉంది. అయినా సభ్యులు తొలగించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్‌ అడ్మిన్లకే  మెసేజ్‌లను తొలగించే సదుపాయం ఉంటే? త్వరలో వాట్సప్‌ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సప్‌ కొత్త అప్‌డేట్‌తో ఇదీ వినియోగంలోకి వస్తుంది. గ్రూప్‌లో ఇతర సభ్యులు పెట్టిన మెసేజ్‌లను అడ్మిన్లు తొలగించినప్పుడు దాన్ని అడ్మిన్‌ డిలీట్‌ చేశారనీ కనిపిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే అభ్యంతరకర సందేశాలను తొలగించటం అడ్మిన్లకు తేలికవుతుంది. ఇదిలాఉండగా- డెస్క్‌టాప్‌ యాప్‌, వెబ్‌ వర్షన్లకు రెండు అంచెలా ధ్రువీకరణ సదుపాయం కల్పించాలనీ వాట్సప్‌ భావిస్తోంది. ఇప్పటికే మొబైల్‌ యాప్‌ వర్షన్‌కు రెండంచెల ధ్రువీకరణ పద్ధతి అందుబాటులో ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని