వరుసగా ఏడో సారీ వేడే..

వాతావరణం శరవేగంగా మారుతూనే ఉంది. దీంతో ఉష్ణోగ్రత పెరుగుతూనే వస్తోంది. అత్యధిక వేడి సంవత్సరాల జాబితాలో 2021 ఏడో ఏడాదిగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు.. పారిశ్రామిక విప్లవం ముందటి రోజులతో పోలిస్తే ఒక డిగ్రీ సెల్షియస్‌ కన్నా ఎక్కువ

Published : 09 Feb 2022 00:30 IST

వాతావరణం శరవేగంగా మారుతూనే ఉంది. దీంతో ఉష్ణోగ్రత పెరుగుతూనే వస్తోంది. అత్యధిక వేడి సంవత్సరాల జాబితాలో 2021 ఏడో ఏడాదిగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు.. పారిశ్రామిక విప్లవం ముందటి రోజులతో పోలిస్తే ఒక డిగ్రీ సెల్షియస్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవటం ఇది వరుసగా ఏడో సారి కావటం గమనార్హం. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ప్రపంచ ఉష్ణోగ్రతల సమాచారాన్ని విశ్లేషించి దీన్ని గుర్తించింది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రత పెరగటం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదాహరణకు కెనడాలోని లీటన్‌లో ఉష్ణోగ్రత 49.6 డిగ్రీల సెల్షియస్‌కు ఎగబాకింది. వాతావరణం మారకపోతే ఇలాంటి అసాధారణ స్థితి తలెత్తే కాదు. భూ ఉపరితల ఉష్ణోగ్రత విషయంలో అత్యధిక వేడి రికార్డును అధిగమించకపోయినా మహా సముద్రాల మీద ఉష్ణోగ్రత విషయంలో 2021 రికార్డు బద్దలు కొట్టింది. మానవ చర్యలతో పుట్టుకొచ్చే కార్బన్‌ డయాక్సైడ్‌ను, ఇది ఒడిసిపట్టే వేడిని మహా సముద్రాలే చాలావరకు గ్రహిస్తాయి. మామూలుగా ‘లా నినా’ ప్రభావంతో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం చివర్లో తగ్గిపోతుంది. తర్వాత వేడి ‘ఎల్‌ నినో’ ప్రభావం మొదలవుతుంది. లా నినా ప్రభావంలోనే ఇలా ఉంటే మున్ముందు ఉష్ణోగ్రత ఇంకెంత పెరగనుందో?!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని