ఫొటో పోయి కార్టూన్‌ వచ్చె..

బొమ్మల నవల అనుభూతిని కలిగించే ప్రొఫైల్‌ ఫొటోలు ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంతా ప్రిక్వెల్‌ యాప్‌ సాఫ్ట్‌వేర్‌ మహాత్మ్యం. ఇది ఫొటోలను ఇట్టే కార్టూన్‌ రూపంలోకి మార్చేస్తుంది మరి. నిజానికి ప్రిక్వెల్‌ యాప్‌

Published : 09 Feb 2022 00:30 IST

బొమ్మల నవల అనుభూతిని కలిగించే ప్రొఫైల్‌ ఫొటోలు ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంతా ప్రిక్వెల్‌ యాప్‌ సాఫ్ట్‌వేర్‌ మహాత్మ్యం. ఇది ఫొటోలను ఇట్టే కార్టూన్‌ రూపంలోకి మార్చేస్తుంది మరి. నిజానికి ప్రిక్వెల్‌ యాప్‌ చాలాకాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఇటీవలే విశేష ఆదరణ పొందుతోంది. ఇందులో 800కు పైగా ఫిల్టర్లు/ఎఫెక్ట్స్‌, బోలెడన్ని వీడియో టెంప్లేట్లు ఉన్నాయి. మీరూ ప్రొఫైల్‌ ఫొటోను గ్రాఫిక్‌ రూపంలో చూసుకోవాలని అనుకుంటే ముందుగా ప్రిక్వెల్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సైన్‌ అప్‌ అయ్యాక ముఖం స్పష్టంగా కనిపించే ఫొటోను ఎంచుకొని కార్టూన్‌ ఫిల్టర్‌ను అప్లయి చేయాలి. క్షణాల్లో ఫొటో కాస్తా కార్టూన్‌ రూపంలోకి మారిపోతుంది. కావాలంటే దీనికి టెక్స్ట్‌ జోడించుకోవచ్చు, రంగులు మార్చుకోవచ్చు. సేవ్‌ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటి యాప్స్‌లలో షేర్‌ చేసుకోవచ్చు. అయితే ప్రిక్వెల్‌ యాప్‌ షరతులకు, నిబంధనలకు అనుమతి ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. సైన్‌ అప్‌ అయ్యేటప్పుడు ఏయే సమాచారాన్ని ఇస్తున్నారో చెక్‌ చేసుకోవాలి. మీ అనుమతి లేకుండా మీ కంటెంట్‌ను పబ్లిష్‌ చేసే హక్కు ఇస్తున్నారేమో చూసుకోవటం మంచిది. ప్రిక్వెల్‌ యాప్‌ను ఉచితంగానే వాడుకోవచ్చు. మరిన్ని ఫీచర్లు కావాలంటే రుసుము చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని