రాస్తే బొమ్మలొస్తాయ్‌!

మనసులో ఒక ఊహా చిత్రం ఉంది. దాన్ని సాకారం చేయాలంటే చిత్రలేఖనం వచ్చి ఉండాలి. లేదంటే చిత్రకారుడి దగ్గరికి వెళ్లి నోటితో చెబుతూ గీయించుకోవాలి. ఇలాంటివేవీ లేకుండా కేవలం టెక్స్ట్‌ సూచనలతో మీకు మీరే బొమ్మ గీసుకోగలిగితే? కృత్రిమ మేధతో ఇది సాధ్యమేనని

Published : 09 Feb 2022 00:30 IST

నసులో ఒక ఊహా చిత్రం ఉంది. దాన్ని సాకారం చేయాలంటే చిత్రలేఖనం వచ్చి ఉండాలి. లేదంటే చిత్రకారుడి దగ్గరికి వెళ్లి నోటితో చెబుతూ గీయించుకోవాలి. ఇలాంటివేవీ లేకుండా కేవలం టెక్స్ట్‌ సూచనలతో మీకు మీరే బొమ్మ గీసుకోగలిగితే? కృత్రిమ మేధతో ఇది సాధ్యమేనని ఓపెన్‌ఏఐ కంపెనీ నిరూపించింది.

ఓపెన్‌ఏఐ సంస్థ గత సంవత్సరం టెక్స్ట్‌ వ్యాఖ్యల నుంచి నిర్దిష్టమైన బొమ్మలను సృష్టించగల డాల్‌-3 అనే సాఫ్ట్‌వేర్‌ను సృష్టించి అందరినీ ఆశ్చర్యపరచింది. దీన్ని ఈ సంవత్సరం మరింత మెరుగుపరిచి గ్లైడ్‌ మోడల్‌ను ఆవిష్కరించింది. పెద్దమొత్తంలో వ్యాఖ్యలతో ముడిపడిన బొమ్మలతో శిక్షణ ఇచ్చింది. ఇది ముందుగా అందించిన సమాచారాన్ని బట్టి ఆయా ఫొటోలకు సంబంధించిన రకరకాల అంశాలను జోడించుకుంటుంది. తర్వాత ఒక్కో అంశాన్ని తొలగించుకుంటూ కచ్చితమైన బొమ్మను రూపొందిస్తుంది. నాణ్యత కూడా మెరుగ్గా ఉండటం విశేషం. ఏ100 గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (జీపీయూ) మీద బొమ్మను సృష్టించటానికిది 15 సెకండ్లు తీసకుంటుంది. కాకపోతే ఖర్చు ఎక్కువ. మున్ముందు చిన్న నమూనాలతో, తక్కువ జీపీయూతోనే బొమ్మలు గీసేలా తీర్చిదిద్దే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని