
జిఫ్ సృష్టికర్తలు మీరే!
ఎలాంటి భావాలను వ్యక్తం చేయటానికైనా ఎమోజీలను ఎడపెడా వాడేస్తుంటాం. ఈ మధ్యన యానిమేటెడ్ జిఫ్స్ వాడకమూ పెరుగుతోంది. వీటిల్లో టెక్స్ట్ సందేశాలను జొప్పిస్తూ సూటిగా భావాలను వ్యక్తం చేయటం, ఎత్తి పొడవటం ఎక్కువైంది. ఇక వీటిని మనమే తయారుచేసుకుంటే ఆ మజానే వేరు.
యానిమేటెడ్ జిఫ్స్ చూడటానికి పొట్టి వీడియో క్లిప్‌ల మాదిరిగా కనిపిస్తాయి. కానీ సాంకేతికంగా చూస్తే ఇవి వీడియోలు కావు. ఇమేజ్ ఫైళ్లు. అందుకే తేలికగా షేర్ చేసుకోవటానికి వీలవుతుంది. వీడియోలు, జిఫ్‌లు.. రెండూ వరుస చిత్రాలతో కదులుతున్న భావనే కలిగిస్తాయి. అయితే జిఫ్స్‌లో మాటలేవీ ఉండవు. ఇలాంటి కొరతను తీర్చటానికే జిఫ్స్‌కు టెక్స్ట్ వ్యాఖ్యలు జోడిస్తుంటారు. జిఫ్స్ కోసం ఇంటర్నెట్‌నే శోధించాల్సిన పనిలేదు. ఫోన్‌లోని ఫొటోలు లేదా వీడియోలా ద్వారా.. అదీ అదనంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండానే వీటిని తయారుచేసుకోవచ్చు.
ఐఓఎస్‌లో ఇలా..
ఐఫోన్, ఐప్యాడ్ వంటి ఐఓఎస్ పరికరాల్లో జిఫ్స్ సృష్టించుకోవటానికి థర్డ్ పార్టీ యాప్‌లు చాలానే ఉన్నాయి. అయితే యాప్ స్టోర్‌కు వెళ్లటానికి ముందు ఫోన్‌లోని సదుపాయాల మీద ఓ కన్నేస్తే మంచిది. ఉదాహరణకు- యాపిల్‌కు చెందిన లైవ్ ఫొటోస్ ఫీచర్‌తో తీసిన ఫొటోలకు ఎఫెక్ట్స్ జోడించి, యానిమేటెడ్ జిఫ్‌గా సేవ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫొటోస్ యాప్‌లోకి వెళ్లి, లైవ్ ఫొటోస్ ఆల్బమ్ నుంచి జిఫ్‌గా మార్చాలనుకునే ఫొటోను ఎంచుకోవాలి. పైన ఎడమ వైపు మూలకు కనిపించే లైవ్ గుర్తును ట్యాప్ చేయాలి. లూప్ లేదా బౌన్స్ వంటి ఫీచర్లను ఎంచుకొని ఎఫెక్ట్స్‌ను జోడించుకోవాలి. తర్వాత ఐఓఎస్ షార్ట్‌కట్స్ యాప్‌ను తెరచి, ఆటోమేటింగ్ యాక్షన్స్ విభాగంలోకి వెళ్లాలి. (ఫోన్‌లో ఇది లేనట్టయితే యాప్ స్టోర్ నుంచి పొందొచ్చు). షార్ట్‌కట్ గ్యాలరీ నుంచి ‘మేక్ జిఫ్ షార్ట్‌కట్’ ఫీచర్‌ను ఎంచుకొని యాడ్ చేసుకోవాలి. దీని ద్వారా లైవ్ ఫొటోను ఇట్టే జిఫ్‌గా మార్చుకోవచ్చు. షార్ట్‌కట్స్ గ్యాలరీలో ‘కన్వర్ట్ బస్ట్ టు జిఫ్’ ఫీచర్ కూడా ఉంటుంది. దీంతో బస్ట్ మోడ్‌లో తీసిన ఫొటోలనూ జిఫ్‌గా మార్చుకోవచ్చు. ‘వీడియో టు జిఫ్’ ఫీచర్‌తో వీడియో క్లిప్‌లనూ జిఫ్‌గా మలచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్‌తో..
ఆండ్రాయిడ్ పరికరాల్లో ఫొటోలను జిఫ్‌లుగా మార్చుకోవటం ఆయా ఫోన్ల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటి మీదా ఆధారపడి ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లలో ఉచిత గ్యాలరీ యాప్‌లో ఫొటోలు, వీడియోలను జిఫ్స్‌గా మార్చుకునే వెసులుబాటు ఉంది. అదే గూగుల్ ఫొటోస్ ఫీచర్‌తోనైతే ఫొటోలను ఎంచుకొని జిఫ్‌గా మార్చుకోవచ్చు. లైబ్రరీలోకి వెళ్లి, యుటిలిటీస్ ఆప్షన్ ద్వారా ‘క్రియేట్ న్యూ’ ఎంచుకోవాలి. యానిమేషన్ ఆప్షన్‌తో ఫొటోలను ఎంచుకొని, ‘క్రియేట్’ బటన్‌ను నొక్కాలి. కొన్ని గూగుల్ పిక్సెల్ ఫోన్లలో ‘మోషన్ ఫొటో’స్ వంటి వాటితో నేరుగా యానిమేటెడ్ జిఫ్స్ తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు- గూగుల్ పిక్సెల్ 4ఎక్స్‌ఎల్ ఫోన్‌లో గూగుల్ ఫొటోస్‌ను తెరచి, మోషన్ ఫొటోగా సేవ్ చేసుకున్న ఇమేజ్‌ను ఎంచుకోవాలి. ఈ ఇమేజ్‌ను పైకి స్వైప్ చేయాలి. లేదా పైన కుడి మూలన కనిపించే మూడు చుక్కలనైనా నొక్కాలి. ఇందులో ‘ఎక్స్‌పోర్ట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత జిఫ్ ఆప్షన్‌తో కొత్త ఫైలును ఫొటో లైబ్రరీలో సేవ్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.
టెక్స్ట్ జోడించాలంటే
ఫోన్‌లోని ఉచిత టూల్స్‌తో తేలికగానే జిఫ్స్ సృష్టించుకోవచ్చు గానీ వీటికి టెక్స్ట్ జోడించాలంటే ఇతర యాప్‌ల సాయం తీసుకోవాల్సిందే. ఎక్కువగా ఉపయోగించేది ఉచిత జిఫీ యాప్. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ ఉపకరిస్తుంది. జిఫీ యాప్‌లో పెద్దమొత్తంలో జిఫ్స్ ఆర్కైవ్ కూడా ఉంది. ఇదే కాదు.. జిఫ్స్‌ను సృష్టించే ఇతర యాప్‌లూ చాలానే ఉన్నాయి. యాడ్స్ వద్దనుకుంటే వీటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇలాంటివాటిల్లో ఒకటి ఐఎంజీప్లే. దీని సాయంతో సెల్ఫీలతోనూ జిఫ్స్ సృష్టించుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: అవే హెచ్చుతగ్గులు.. కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి..!
-
Business News
Stock Market Update: జులై నెలకు స్టాక్ మార్కెట్ల నష్టాల స్వాగతం
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20, వన్డేలకు.. టీమ్ఇండియా ఆటగాళ్ల ఎంపిక
-
Related-stories News
Sonu sood: కుమారుడి చికిత్స కోసం ఓ తల్లి తాపత్రయం.. సోనూసూద్ పేరుతో ఆన్లైన్ మోసం
-
Politics News
Shivsena: శివసేన ముందు ముళ్లబాట!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే