డెస్క్‌టాప్‌ నుంచి కిండిల్‌కు పీడీఎఫ్‌ పైళ్లు

ఇ-బుక్స్‌ చదువుకోవటానికి కిండిల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఇందులో మన సిస్టమ్‌లో ఉన్న పీడీఎఫ్‌ పైళ్లను పంపించుకొని, చదువుకోవాలనీ అనిపించొచ్చు. దీనికి మార్గం లేకపోలేదు. ఈమెయిల్‌ ద్వారా కిండిల్‌ పరికరానికి పీడీఎఫ్‌ను

Updated : 16 Sep 2022 14:02 IST

ఇ-బుక్స్‌ చదువుకోవటానికి కిండిల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఇందులో మన సిస్టమ్‌లో ఉన్న పీడీఎఫ్‌ పైళ్లను పంపించుకొని, చదువుకోవాలనీ అనిపించొచ్చు. దీనికి మార్గం లేకపోలేదు. ఈమెయిల్‌ ద్వారా కిండిల్‌ పరికరానికి పీడీఎఫ్‌ను పంపించుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం సెటింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, లాగిన్‌ కావాలి. కుడివైపున పైన ఉండే ‘అకౌంట్స్‌ అండ్‌ లిస్ట్స్‌’ ద్వారా కిందికి వెళ్లి, ‘మేనేజ్‌ యువర్‌ కంటెంట్‌ అండ్‌ డివైసెస్‌’ మీద క్లిక్‌ చేయాలి. ‘ప్రిఫరెన్సెస్‌’ ట్యాబ్‌ మీద ట్యాప్‌ చేసి కిందికి వెళ్లాలి. ఇందులోని ‘పర్సనల్‌ డాక్యుమెంట్‌ సెటింగ్స్‌’లో కిండిల్‌ డివైస్‌, దాని ఈమెయిల్‌ అడ్రస్‌ కనిపిస్తాయి. ఆ పేజీలో అలాగే కిందికి వెళ్లి, మనం దేని ద్వారా పీడీఎఎఫ్‌ను పంపించాలని అనుకుంటున్నామో ఆ ఈమెయిల్‌ను జతచేయాలి. చివరగా.. ‘డివైస్‌ సింక్రనైజేషన్‌’ మీద క్లిక్‌ చేసి, దాన్ని ఆన్‌ చేసుకోవాలి. తర్వాత అప్రూవ్‌ అయిన ఈమెయిల్‌ అడ్రస్‌ నుంచి పీడీఎఫ్‌ ఫైలును పంపిచుకోవచ్చు. డెస్క్‌టాప్‌ మీదున్న పుస్తకాలనూ కిండిల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

* అయితే మనం పంపించిన పీడీఎఫ్‌ పైళ్లు కొన్నిసార్లు కిండిల్‌కు అనుగుణంగా లేకపోవచ్చు. మాటిమాటికీ జూమ్‌ చేయటం, కిందికి జరపటం చికాకు కలిగించొచ్చు. అందువల్ల ముందే పీడీఎఫ్‌ ఫైళ్లను కిండిల్‌కు అనుగుణంగా మార్చుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. జాంజర్‌, కాలిబర్‌, ఆన్‌లైన్‌ ఈబుక్‌ కన్వర్టర్‌, టోయ్‌పబ్‌, పీడీఎఫ్‌ ఆన్‌లైన్‌ కన్వర్ట్‌ వంటి వెబ్‌సైట్‌ల సాయంతో ఫైళ్లను కిండిల్‌కు తగినట్టుగా మార్చుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని