ట్విటర్‌ ‘గేలి’ పోరు పడకుండా..

ట్విటర్‌లో గేలిచేసే వారితో ఇబ్బంది పడుతున్నారా? అయితే త్వరలోనే పరిష్కారం లభించనుంది. ట్రోలర్స్‌ బెడదను తగ్గించేందుకు ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని పేరు ఫ్లాక్‌. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఫీచర్‌ మాదిరిగా పనిచేస్తుంది. దీన్ని ఒకరకంగా గ్రూప్‌ అనుకోవచ్చు.

Updated : 16 Feb 2022 00:44 IST

ట్విటర్‌లో గేలిచేసే వారితో ఇబ్బంది పడుతున్నారా? అయితే త్వరలోనే పరిష్కారం లభించనుంది. ట్రోలర్స్‌ బెడదను తగ్గించేందుకు ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని పేరు ఫ్లాక్‌. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఫీచర్‌ మాదిరిగా పనిచేస్తుంది. దీన్ని ఒకరకంగా గ్రూప్‌ అనుకోవచ్చు. మీ ఫ్లాక్‌లో 150 మంది వరకు జతచేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో చేసిన ట్వీట్లు ఫ్లాక్‌లో ఉన్నవారికే వారికే కనిపిస్తాయి. అంటే ట్వీట్లు ప్రపంచానికంతా చేరవన్నమాట. ‘ట్వీట్‌ చేసినవారు తమ ఫ్లాక్‌కు మిమ్మల్ని యాడ్‌ చేయటం వల్లనే దీన్ని మీరు చూడగలుగుతున్నారు’ అనే సందేశమూ అవతలివారికి కనిపిస్తుంది. ఫ్లాక్‌ ఫీచర్‌ ద్వారా ట్రోలర్ల పోరు చాలావరకు తప్పించుకోవచ్చు. ఫ్లాక్‌లోనూ ఎవరైనా గేలిచేస్తే? ఈ జాబితాలోంచి ఎవరినైనా, ఎప్పుడైనా తొలగించుకునే వెసులుబాటు ఉంటుందిగా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని