ఫోన్‌ నంబరు మారినా సిగ్నల్‌ ఛాట్‌ డేటా భద్రం

ఫోన్‌ నంబరు మారితే సిగ్నల్‌ యాప్‌లో ఛాట్స్‌, గ్రూప్స్‌, మెసేజెస్‌ అన్నీ అదృశ్యమవుతాయి. ఇప్పుడిక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. సిగ్నల్‌ కొత్తగా ‘ఛేంజ్‌ నంబర్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫోన్‌ నంబరును మార్చుకున్నా డేటా కోల్పోకుండా

Updated : 16 Feb 2022 06:52 IST

ఫోన్‌ నంబరు మారితే సిగ్నల్‌ యాప్‌లో ఛాట్స్‌, గ్రూప్స్‌, మెసేజెస్‌ అన్నీ అదృశ్యమవుతాయి. ఇప్పుడిక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. సిగ్నల్‌ కొత్తగా ‘ఛేంజ్‌ నంబర్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫోన్‌ నంబరును మార్చుకున్నా డేటా కోల్పోకుండా చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌ వీ5.27.1 అప్‌డేట్‌తో కూడిన ఐఓఎస్‌, వీ5.30.6 అప్‌డేట్‌తో కూడిన ఆండ్రాయిడ్‌.. రెండింటికీ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ముందుగా ప్రొఫైల్‌లోకి వెళ్లి, సెటింగ్స్‌ ద్వారా అకౌంట్‌ను క్లిక్‌ చేయాలి. అందులో ఛేంజ్‌ ఫోన్‌ నంబరు ఆప్షన్‌ను ఎంచుకొని, కంటిన్యూ బటన్‌ను నొక్కాలి. పాత నంబరును, అనంతరం కొత్త నంబరును ఎంటర్‌ చేయాలి. తర్వాత కొత్త నంబరును కన్‌ఫర్మ్‌ చేసి, ఛేంజ్‌ నంబరును ఎంచుకోవాలి. తెర మీద కనిపించే సూచనలతో ప్రక్రియను పూర్తి చేయాలి. కొత్త నంబర్‌ అప్‌డేట్‌ కాగానే నంబర్‌ను మార్చినట్టు సిగ్నల్‌ యాప్‌ థ్రెడ్‌ మీద కనిపిస్తుంది. కాంటాక్ట్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవటానికి లింక్‌ కూడా ప్రత్యక్షమవుతుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోగానే ఛాట్స్‌, గ్రూప్స్‌ వంటివన్నీ ఎప్పట్లానే ఉంటాయి. ఫోన్‌ నంబరు మార్చినట్టు సిగ్నల్‌లో మీ కాంటాక్ట్స్‌కూ సందేశం అందుతుంది. అయితే ఫోన్‌ నంబరును మారుస్తున్నారు గానీ ఫోన్‌ను కాదని గుర్తుంచుకోవాలి. నంబరు మార్చినా అదే ఫోన్‌ను వాడుకుంటేనే పాత ఛాట్స్‌ భద్రంగా ఉంటాయి. ఒకవేళ ఫోన్‌ను మార్చినట్టయితే ఎండ్‌ టు ఎండ్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిని వాడుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని