అత్యంత భారీ నక్షత్ర మండలం!

ఇంతపెద్ద నక్షత్ర మండలమా? ఖగోళ పరిశోధకులు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇటీవలే గుర్తించిన నక్షత్ర మండలం ఊహకు అందనంత భారీగా ఉంది మరి. శక్తిమంతమైన రేడియో తరంగాలతో కూడిన (రేడియో గెలాక్సీ)...

Published : 23 Feb 2022 01:02 IST

ఇంతపెద్ద నక్షత్ర మండలమా? ఖగోళ పరిశోధకులు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇటీవలే గుర్తించిన నక్షత్ర మండలం ఊహకు అందనంత భారీగా ఉంది మరి. శక్తిమంతమైన రేడియో తరంగాలతో కూడిన (రేడియో గెలాక్సీ) దీని పేరు ఆల్కీయోనియస్‌. మన సౌరమండలానికి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంతరిక్షంలో 5 మెగాపార్‌సెక్స్‌ పరిమాణంలో విస్తరించిన దీని పొడవు 1.63 కోట్ల కాంతి సంవత్సరాలు. మన పాలపుంత కన్నా 100 రెట్లు పెద్దది. ఇప్పటివరకు గుర్తించిన అతి పెద్ద ఖగోళాకృతి ఇదే! దీని ద్రవ్యరాశి సూర్యుడి కన్నా 24వేల కోట్ల రెట్లు ఎక్కువ. భారీ రేడియో గెలాక్సీల గురించే కాదు.. విశాల విశ్వంలో అంతర్‌ నక్షత్ర మండల మాధ్యమాన్ని మరింతగా అర్థం చేసుకోవటానికీ తోడ్పడగలదని ఆశిస్తున్నారు. రేడియో గెలాక్సీలంటేనే అంతు పట్టని రహస్యాలు. వీటి అంతర్భాగంలోంచి ప్రవాహాలు, ఖండాలు ఎగిసి పడుతుంటాయి. ఇవి అంతర్‌ నక్షత్ర మాధ్యమంతో చర్య జరిపి, ఎలక్ట్రాన్ల వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రేడియో ఉద్గారాలు పుట్టుకొస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని