ఉభయచర రోబో

అవసరమైతే ఆకారాన్ని మార్చుకోగలదు. ఆ రూపాన్ని నిలుపుకోగలదు. తిరిగి పూర్వ స్థితికి రాగలదు. కాబట్టే ఆ రోబో కారు మాదిరిగా నేల మీద ప్రయాణిస్తుంది.

Updated : 02 Mar 2022 06:26 IST

వసరమైతే ఆకారాన్ని మార్చుకోగలదు. ఆ రూపాన్ని నిలుపుకోగలదు. తిరిగి పూర్వ స్థితికి రాగలదు. కాబట్టే ఆ రోబో కారు మాదిరిగా నేల మీద ప్రయాణిస్తుంది. అడ్డంకులు ఎదురైనప్పుడు డ్రోన్‌గా మారి ఆకాశంలోనూ ఎగురుతుంది. వర్జీనియా టెక్‌ సంస్థ పరిశోధకులు. ఇలాంటి చిత్రమైన రోబో పరిజ్ఞానాన్నే రూపొందించారు. గేర్లు, బెల్టులు, మోటార్ల వంటివేవీ లేకుండానే దీన్ని తయారుచేయటం విశేషం. కొంత రబ్బరు, కొంత లోహం, ఉష్ణ పరిజ్ఞానం, కిరిగామీల మేళవింపుతోనే దీన్ని సాధించారు. కిరిగామీ అంటే ఏంటో తెలుసా? కాగితంలో కళాకృతులు చేసే ఓరిగామీకి మరో రూపం. ఇందులో కాగితాన్ని కత్తిరించి, మడిచి ఆకృతులను తయారుచేస్తారు. దీని మూలంగానే క్లిష్ట పరిస్థితుల్లో రోబోలోని లోహం సాగుతుంది. దీంతో దీని మధ్యభాగం వంగి, సమతలంగా అవుతుంది. రబ్బరు మిశ్రమంలోని ప్రత్యేకమైన లోహం ఆ ఆకారాన్ని అలాగే సాగి ఉంచుతుంది. అప్పుడు రోబో క్షణాల్లో డ్రోన్‌గా మారి పైకి ఎగురుతుంది. పని పూర్తయ్యాక రోబోలోని హీటర్లు లోహాన్ని వేడిచేసి, ద్రవ రూపంలోకి మారుస్తాయి. రోబో యథాస్థితికి వస్తుంది. లోహం చల్లబడుతుంది. ఒకరకంగా దీన్ని ఉభయచర రోబో అనుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని